LOADING...
Rakshabandhan wishes: రాఖీ పండగకు తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు అర్థవంతమైన సందేశాలు ఇవే! 
రాఖీ పండగకు తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు అర్థవంతమైన సందేశాలు ఇవే!

Rakshabandhan wishes: రాఖీ పండగకు తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు అర్థవంతమైన సందేశాలు ఇవే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రక్షాబంధన్ రోజున, మీ సోదరికి లేదా సోదరుడికి ప్రేమతో కూడిన శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని హృద్యమైన సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం. వాట్సాప్ స్టేటస్‌,ఫేస్‌ బుక్ పోస్టుల ద్వారా ఈ సందేశాలను పంచుకోండి. మీ అనుబంధాన్ని సెలెబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ హృద్యమైన సందేశాలను చూద్దాం:

వివరాలు 

#1

సోదరా! నువ్వే నా జీవితాన్ని వెలిగించే వెలుగు, నువ్వు లేని నా జీవితం పూర్తి కాదు. ఈ రాఖీ పండుగ రోజున మన బంధం ఎప్పటికీ ప్రేమతో నిండి ఉండాలని ఆశిస్తున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు!#2చిన్ననాటి నుంచి మన బంధం ఓ రోలర్ కోస్టర్ ప్రయాణంలా సాగుతోంది. ప్రతి మలుపూ నాకు మరిచిపోలేని జ్ఞాపకం. హ్యాపీ రాఖీ!#3నువ్వే నా శత్రువు, నువ్వే నా మిత్రుడు, నువ్వే నా తోడు, నీడ కూడా నువ్వే. ఏ దూరంలో ఉన్నా, నా ప్రేమ ఎప్పుడూ నీతో ఉంటుంది. హ్యాపీ రక్షాబంధన్!#4అక్కలు, చెల్లెళ్లు పూల పరిమళంలా ఉంటారు, ఎక్కడ ఉన్నా సంతోషాన్ని పంచుతారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు నా చెల్లికి!

వివరాలు 

#5

మన బంధం జన్మల తరబడి ఉండిపోయే బలమైన అనుబంధం. దీన్ని విశ్వాసంతో, ప్రేమతో, రాఖీ ముడితో మరింత బలంగా మారుద్దాం. హ్యాపీ రాఖీ!#6ప్రభువు నీకు అన్నిరకాల ఆనందాలను కలిగించాలని, నీ జీవితమంతా సుఖసంతోషాలతో నిండిపోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి జన్మలోనూ నువ్వే నా సోదరుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రక్షాబంధన్!#7ఈ బంధంలో ప్రేమ ఉంది, చిన్న చిన్న గొడవలూ ఉన్నాయి, చిన్ననాటి మధుర జ్ఞాపకాల కోశముంది. మన సోదరభాగిన బంధం ఎంతో ప్రత్యేకమైనది. రాఖీ పండుగ శుభాకాంక్షలు!

వివరాలు 

#8

రాఖీ అంటే కేవలం ఓ దారమేం కాదు... అది మన జ్ఞాపకాలను, రహస్యాలను, గడిపిన క్షణాలను కలిపే బంధం. హ్యాపీ రాఖీ!#9రాఖీ అనేది ఓ బంధం, మన మధ్య జీవిత ప్రయాణానికి గుర్తుగా నిలిచే సంబంధం. మన ఆనందాలన్నీ ఈ బంధం చుట్టూనే తిరుగుతాయి. హ్యాపీ రక్షాబంధన్!#10సోదరి ప్రేమ అంటే దేవుని వరమే. మన మధ్య బంధం దుఃఖాలకు తావులేనిది, దూరం తాళలేనిది. రక్షాబంధన్ శుభాకాంక్షలు!

వివరాలు 

#11

మన బంధం గొడవల్లో, అలకల్లోనే ఉంటుంది, కానీ ఒకరి సంతోషాన్ని మరోకరు జరుపుకునే గొప్పతనం ఇందులో ఉంది. హ్యాపీ రక్షాబంధన్! #12మన బంధం జన్మతో మొదలైంది, ప్రేమ, నమ్మకంతో బలపడింది. ఈ విడదీయలేని అనుబంధాన్ని ఈ పండుగతో మరింత ఘనంగా చేసుకుందాం. హ్యాపీ రక్షాబంధన్!