
మెనోపాజ్ సమయంలో బరువు పెరుగుతున్నారా? తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల వయసు నలభై దాటిపోతుంటే వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో శరీర బరువు పెరుగుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
అందులో ఒకటి ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడమే.
మెనోపాజ్ సమయంలో పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంటుంది. అయితే ఈ సమయంలో శరీరంలో జరిగే మార్పులను ముందుగానే గుర్తించి బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆ పనులు ఏంటో చూద్దాం.
వ్యాయామం:
రోజూ కనీసం అరగంటసేపు ఎక్సర్ సైజ్ కచ్చితంగా చేయాలి. మహిళలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. దీనివల్ల శరీరంలో కదలికలు ఉంటాయి కాబట్టి కొవ్వు పేరుకు పోకుండా ఉంటుంది.
Details
బరువు తగ్గడానికి నిద్రపోవాలి
కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి:
మెనోపాజ్ సమయంలో కొవ్వు పేరుకు పోతుందని ఇంతకు ముందే తెలుసుకున్నాం. అందువల్ల మీరు కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
ఆహారం తక్కువగా తీసుకోవాలి:
మెనోపాజ్ స్థితికి చేరుకున్న తర్వాత శరీరంలో జీవక్రియలు మందగిస్తాయి. అందువల్ల అధిక ఆహారం తీసుకోకూడదు. దానివల్ల కొవ్వు పేరుకుపోయి మీ ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు ఎంత తింటున్నారనే విషయంపై మీకు ఒక ఆలోచన ఉండాలి.
సరైన నిద్ర:
నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి కావలసినంత సేపు నిద్రపోవడం చాలా మంచిది.