Page Loader
Skin in Winter : శీతాకాలంలో చర్మం పొడిగా మారుతుందా.. ఈ టిప్స్ మీ కోసమే  
Dry Skin : శీతాకాలంలో చర్మం పొడిగా మారుతుందా..ఈ టిప్స్ మీ కోసమే

Skin in Winter : శీతాకాలంలో చర్మం పొడిగా మారుతుందా.. ఈ టిప్స్ మీ కోసమే  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 15, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

చలికాలంలో స్కిన్ పొడిబారుతుంటుంది. ఈ సమయంలో చల్లని గాలులు చర్మంలో తేమను కోల్పోవడానికి కారణమవుతాయి. ఫలితంగా శరీరంపైన ఉండే చర్మం పొడిగా మారి, దురదరావడం, చిరాకు రావడం వంటివి జరుగుతుంటాయి. పొడి చర్మ సమస్యను తగ్గించేందుకు మనం వేలు ఖర్చు పెట్టి, ఏవేవో లోషన్లు కొనాల్సిన అవసరం లేదు. అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసే వంటింటి చిట్కాలు, పోషకాహారాలున్న పదార్థాలను మాశ్చరైజర్లుగా వాడితే సరి. కొబ్బరి నూనెలోని కొవ్వు, ఆమ్లాలు చర్మానికి సహజ తేమను అందిస్తూ రాత్రంతా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఫలితంగా చర్మం పొడి బారకుండా కాపాడుతుంది.

DETAILS

పొడి చర్మ సమస్యను తగ్గించడంలో కొబ్బరి నూనె టాప్

1. కొబ్బరి నూనె పొడి చర్మ సమస్యను తగ్గించడంలో కొబ్బరి నూనె సహకరిస్తుంది. చల్లని వాతావరణంలో చర్మం పొడిగా మారకూడదంటే స్కిన్ కు మాశ్చరైజర్ అందించాలి. నిద్రవేళకు ముందు చర్మానికి కొబ్బరి నూనె రాయాలి. అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి రాత్రంతా చర్మాన్ని పొడిబారకుండా రక్షిస్తుంది. 2. తేనె ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె సమాన భాగాలతో తేనెను కలిపి చర్మానికి పూతగా రాయాలి. ఫలితంగా చర్మంలోని తేమను నిలుపుకునేందుకు ఇది సహకరిస్తుంది. హనీ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటంతో చర్మం పొడిబారడం కారణంగా కలిగే చికాకు లేదా మంట తగ్గిపోతుంది.

DETAILS

గోరువెచ్చని నీటితో ఓట్ మీల్ పేస్ట్‌

3. అవోకాడో పండిన అవకాడోను మెత్తగా నూరి చర్మానికి అప్లై చేయండి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు చర్మానికి తేమగా, పోషణ అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్న అవకాడోలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. 3. ఓట్ మీల్ స్నానపు నీటిలో మెత్తగా రుబ్బిన ఓట్‌మీల్‌ను చేర్త్చుకోవాలి లేదా గోరువెచ్చని నీటితో కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. దీన్ని చర్మానికి నేరుగా పట్టించాలి. మృత చర్మ కణాలను తొలగించి పొడి, చికాకు కలిగించే చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఇదే సమయంలో చర్మంపై రక్షిత పొరను ఏర్పరచి తేమను అందిస్తుంది.

DETAILS

కలబందలోని మాయిశ్చరైజింగ్ గుణాలతో చర్మానికి తక్షణ ఉపశమనం 

5. ఆలివ్ ఆయిల్ చర్మంపై ఆలివ్ నూనె తో మసాజ్ చేయండి. దాదాపు 30 నిమిషాల పాటు శరీరంపై ఆరనివ్వాలి. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండటంతో చర్మానికి తేమను అందిస్తాయి. ఫలితంగా మృదువుగా ఉండేందుకు సహకరిస్తాయి. 6. కలబంద తాజా అలోవెరా జెల్‌ని స్కిన్ కు మర్దన చేయండి. కలబందలోని మాయిశ్చరైజింగ్ గుణాలతో చర్మానికి తక్షణ ఉపశమనం కలుగుతాయి. 7. మంచి నీరు శరీరానికి కావాల్సినంత నీరు అందించాలి. ఈ మేరకు హైడ్రేటెడ్ మోడ్ లో ఉంచుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచాలంటే, పొడిబారకుండా ఉండేందుకు ప్రతి రోజూ కనీసం 8 గ్లాసుల మేర నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.