LOADING...
Golden Blood: ఈ రక్తం నిజంగానే 'బంగారం'లా విలువైనది.. అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా? 
అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా?

Golden Blood: ఈ రక్తం నిజంగానే 'బంగారం'లా విలువైనది.. అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మనకు తెలిసిన రక్త గ్రూప్‌లంటే సాధారణంగా A, B, AB, O లు గుర్తొస్తాయి. కానీ, ఇవికాకుండా ప్రపంచంలో అతి అరుదైన మరో రక్త గ్రూప్ కూడా ఉందని మీకు తెలుసా? ఈ రక్త గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మించని వ్యక్తుల్లో మాత్రమే ఉన్నదని వినగానే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇది వాస్తవమే. ఈ అరుదైన రక్త గ్రూప్‌కు 'గోల్డెన్ బ్లడ్' (Golden Blood) అనే పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముప్పై నుంచి యాభై మంది మధ్యలో మాత్రమే ఈ రక్త గ్రూప్ కలిగి ఉన్నారు.

వివరాలు 

ఈ గోల్డెన్ బ్లడ్ అంటే ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? 

మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల్లో సాధారణంగా Rh యాంటీజన్లు ఉంటాయి. కానీ ఈ యాంటీజన్లు పూర్తిగా లేనప్పుడు,దాన్ని శాస్త్రవేత్తలు 'Rh-null' రక్తం అంటారు. అదే ఈ గోల్డెన్ బ్లడ్. ఈ రక్త గ్రూప్‌ అత్యంత అరుదైనదైనందున దీన్ని గోల్డెన్ బ్లడ్ అని పిలుస్తున్నారు. అరుదైన యాంటీజన్ లక్షణాలు ఉన్నవారి రక్తాన్ని విశ్లేషిస్తే ఈ రకం గుర్తించవచ్చు. ఇది సాధారణంగా కనిపించే O+, O-, A+, A-, B+, B-, AB+, AB- రక్త గ్రూప్‌లకు భిన్నంగా ఉంటుంది. ఈ రక్త గ్రూప్‌ను తొలిసారి 1961లో ఆస్ట్రేలియాలో గుర్తించారు. ఓ ఆదివాసీ మహిళ రక్తపరీక్షల్లో ఆమె శరీరంలో A, B, Rh యాంటీజన్లు లేవని తేలింది.

వివరాలు 

వైద్యరంగంలో ఈ రక్తానికి ఎంతో ప్రాధాన్యత

అప్పటినుంచి ఈ గ్రూప్‌ను శాస్త్రవేత్తలు గోల్డెన్ బ్లడ్‌గా పరిగణిస్తున్నారు. భారత్‌లో ఇదే రక్త గ్రూప్‌కు సంబంధించిన ఒక ఉదాహరణ 2022 జూలై 14న గుజరాత్ రాష్ట్రంలో నమోదైంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 65 ఏళ్ల వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతని రక్తం గోల్డెన్ బ్లడ్ అని గుర్తించారు. వైద్యరంగంలో ఈ రక్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రక్తాన్ని "ప్రాణదాత"గా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇది విశ్వదాత రక్తం(universal Donor) . అంటే,ఇతర ఏ రక్త గ్రూప్‌ వ్యక్తికి అవసరమైనా,గోల్డెన్ బ్లడ్‌ను వినియోగించవచ్చు.

వివరాలు 

గోల్డెన్ బ్లడ్ నిజంగానే 'బంగారం'తో సమానం

రక్తంలో ప్రతిచర్యలు తక్కువగా ఉంటాయి. కానీ Rh-null గ్రూప్ ఉన్న వ్యక్తికి మాత్రం అదే గ్రూప్ నుండి మాత్రమే రక్తదానం జరగాలి. అందుకే ఇది అత్యంత అరుదైనదిగా, ఖరీదైనదిగా పరిగణించబడుతుంది. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ రక్తం ఇమ్యూనోగ్లోబులిన్ ఆధారిత ఔషధాల అభివృద్ధిలో కీలకంగా ఉపయోగపడుతుంది. ఇదంతా చూస్తే ఈ గోల్డెన్ బ్లడ్ నిజంగానే 'బంగారం'తో సమానం అనిపించక మానదు!