Benefits of Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో కలిగే ప్రయోజనాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో సీజన్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశముంది.
ముఖ్యంగా జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్, స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో అందుబాటులో ఉండే ఆవాల నూనె(Mustard Oil) చాలా ఉపయోగపడుతుంది.
సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాక, కొన్ని తీవ్రమైన వ్యాధులను దరి చేరకుండా చేయడంలో ఆవనూనె సాయపడుతుంది.
ముఖ్యంగా చలికాలంలో గోరువెచ్చని ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఆవనూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి.
దీంతో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
Details
క్యాన్సర్ కణాలను తగ్గించడంలో ఆవ నూనె సాయపడుతుంది
ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఒకవేళ ముక్కు మూసుకుపోయినట్లయితే వేడి నీటిలో ఆవాల నూనె వేసి ఆవిరి పడితే సమస్య పరిష్కారమవుతుంది.
ఆవనూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి, కాసేపు ఉడికించి, ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కులను ముక్కులో వేసుకోవాలి.
ఇలా చేస్తే జలుబు తగ్గుముఖం పడుతుంది.
ముఖ్యంగా ఆవ నూనెలో క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సాయపడుతుందని పరిశోధనలో వెల్లడైంది.
ఆహారంలో ఆవ నూనె మాత్రమే ఉపయోగిస్తే క్యాన్సర్ దరిచేరకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.