Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ప్రస్తుత వాతావరణంలో అనేక మార్పుల వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. చలికాలంలో చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది. చలికాలం ప్రారంభమైప్పటి నుండి మనం చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికి బయటికి వెళ్లే సమయంలో వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను మాత్రమే ధరించాలి. స్కార్ఫ్, జర్కిన్, తలకు హెల్మెట్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు వంటి ధరించడం మంచింది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగుళ్లు, పొడిబారటం, దురదలు వంటి సమస్యలు ఏర్పడతాయి. శీతాకాలంలో వేడి నీటితో స్మానం చాలా సౌకర్యవంతగా ఉంటుంది. అదే పనిగా ఎక్కువ సమయం వేడి నీటిలో గడిపితే చర్మంలోని సహజ నూనెలు త్వరగా తొలగిపోయే ప్రమాదం ఉంది.
కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవాలి
చలికాలంలో చర్మానికి మాయిశ్చరైజింగ్ ను అప్లే చేయడం వల్ల మేలు జరుగుతుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జిడ్డుగల చర్మం ఉన్నవారు సహజమైన మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ నీటిని తాగాలి. ఇక ఆహారంలో కొన్ని పండ్లు, పండ్ల రసాలను తాగాలి. చర్మాన్ని హైడ్రేట్ ఉంచటంతో పాటు పోషకాలను అందించే ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం ముఖ్యం. స్నానం చేసిన వెంటనే కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవాలి. వారానికి ఒకసారైనా ఆలివ్ ఆయిల్,కొబ్బరి నూనెతో మసాజ్ చేసు కోవటం మంచిది.