Page Loader
Indian Railway : రైలు బయలుదేరే ముందు కూడా టికెట్‌..? కరెంట్‌ బుకింగ్‌ వివరాలివే
రైలు బయలుదేరే ముందు కూడా టికెట్‌..? కరెంట్‌ బుకింగ్‌ వివరాలివే

Indian Railway : రైలు బయలుదేరే ముందు కూడా టికెట్‌..? కరెంట్‌ బుకింగ్‌ వివరాలివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరొందింది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంది. తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువ మంది భారతీయులు రైళ్లను ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. కరెంట్‌ బుకింగ్‌ గురించి మీకు తెలుసా? రైలు ప్రయాణానికి ముందే టికెట్‌ బుక్‌ చేసుకోవడం సాధారణం. దాదాపు 60 రోజుల ముందుగా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక తాత్కాల్‌ టికెట్‌ సౌకర్యం అత్యవసర ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. చివరి నిమిషాల్లో కూడా బెర్తులు ఖాళీగా ఉంటే మరికొందరు ప్రయాణికులు ప్రయోజనం పొందేలా కరెంట్‌ బుకింగ్‌ పద్ధతిని రైల్వే బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Details

 చార్ట్ సిద్ధమయ్యాక కూడా టికెట్ బుకింగ్‌ 

బహుశా ఇది చాలా మందికి తెలియదు. కానీ రైలులో చార్ట్‌ సిద్ధమైన తర్వాత కూడా ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైల్వే చార్ట్‌ సాధారణంగా రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు తయారవుతుంది. ఈ సమయంలో ఖాళీగా ఉన్న సీట్లు కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్ల ద్వారా అందుబాటులోకి వస్తాయి. రైలు బయలుదేరే పది నిమిషాల ముందు కూడా ఖాళీ బెర్తులు ఉంటే టికెట్లు జారీ చేస్తారు. కరెంట్‌ బుకింగ్‌ ఎలా చేయాలి? 1. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లను సంప్రదించాలి. 2.చార్ట్‌ సిద్ధమైన తర్వాత బెర్త్‌లు ఖాళీగా ఉంటే, సీట్లు కరెంట్‌ బుకింగ్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. 3. రైలు ప్రయాణానికి కొద్దిసేపటి ముందు ఇది అందుబాటులో ఉంటుంది.

Details

 ఖాళీ బెర్తులు - ప్రయాణికులకు సువర్ణ అవకాశం 

కొన్ని సందర్భాల్లో, రైలు చార్ట్‌ సిద్ధమైనప్పటికీ ప్రయాణికుల రద్దు కారణంగా సీట్లు ఖాళీగా మిగిలిపోతాయి. ఈ సీట్లు దక్కించుకునేందుకు కరెంట్‌ బుకింగ్‌ ప్రయాణికులకు సువర్ణ అవకాశం. అయితే తఈ సదుపాయం డిమాండ్‌ అధికంగా ఉండే ట్రైన్‌ రూట్లలో కూడా అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే ప్రయాణికుల కోసం కొత్త సదుపాయాలు ఈ కరెంట్‌ బుకింగ్‌ విధానం అత్యవసర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటే, చివరి నిమిషాల్లో కన్ఫర్మ్‌ టికెట్‌ పొందే అవకాశం అందరికీ ప్రయోజనం చేకూరుస్తోంది. కాబట్టి చివరి నిమిషంలో కూడా రైలు ప్రయాణానికి ప్లాన్‌ చేయాలనుకుంటే కరెంట్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.