చలికి చెంపలు ఎర్రగా మారుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే
శీతాకాలం జోరు ప్రారంభమైంది. ఈ కాలంలో వింటర్ రోసేసియా అనేది సహజం. అయితే మన శరీరం మాములు చలికి తట్టుకుంటుంది కానీ డిసెంబర్, జనవరిలో వచ్చే విపరీత చలికి మాత్రం ఒడిదొడుకులకు గురవుతుంది. ఫలితంగా బుగ్గలు పొడిబారడం, ఎర్రబడటం వాంటి సమస్యలు చుట్టుముడుతాయి. దీని కోసం పలు చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు ఆరోగ్యంతో పాటు చర్మంపై ప్రభావం చూపిస్తుంది. చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారి చేతులు, పెదవులు, పాదాలు, బుగ్గలు పొడిగా మారి ఇబ్బందులు పెడతాయి. బుగ్గలు ఎర్రగా మారటం వంటి మరో సమస్య చలికాలంలోనే ఎదురవుతుంది. అసలు ఈ కాలంలోనే ఎందుకు ఎరుపెక్కుతాయి. కనుక చర్మ సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలంటే..
చలికాలమైనా సరిపడ నీరు తాగాల్సిందే
శీతాకాలంలో శరీరంలో రక్త ప్రసరణ కాస్త నెమ్మదిస్తుండటం వల్ల చర్మం లోపలి రక్త నాళాలు రక్త సరఫరా కోసం వెడల్పుగా మారతాయి. ఫలితంగా ముఖానికి కావాల్సిన రక్తం సరఫరా అవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం చర్మాన్ని వెచ్చగా చేసేందుకు కృషి చేస్తింది కాబట్టి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా బుగ్గలు ఎర్రగా మారతాయి. మరోవైపు చల్ల గాలులు, అధిక మాయిశ్చరైజర్లు, పోషకాహార లోపం చర్మం ఎర్రగా మారేందుకు కారణమవుతాయి. చర్మం ఎర్రగా మారకూడదంటే : చలికాలంలో పెద్దగా దాహం అనిపించదు. దీంతో చాలా మంది అసలు నీటిని తీసుకోరు. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ బారిన పడుతుంది. ఈ మేరకు మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉండదు, కాబట్టి చర్మం పగిలిపోవడం ప్రారంభమవుతుంది.
కొల్లాజెన్ లెవెల్స్ సరిపడ ఉంటే స్కిన్ సేఫ్
మన వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ తగ్గుతుంటుంది. కొల్లాజెన్ చర్మానికి చక్కటి ఏజెంట్ గా పనిచేస్తుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా నిలుస్తుంది. కొల్లాజెన్ అనేది చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో మీ బుగ్గలు ఎర్రగా మారితే, చర్మ సంరక్షణలో భాగంగా కొల్లాజెన్ సప్లిమెంట్లను లేదా కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. హైడ్రేటింగ్ సీరం హైలురోనిక్ యాసిడ్ అధికంగా ఉండే సీరమ్ ఎర్రని బుగ్గలను సాధారణంగా మారుస్తుంది. సీరాన్ని ఉపయోగించే ముందు మీ చర్మ రకాన్ని తెలుసుకోవడం ప్రధానం. హైడ్రేటింగ్ మాస్క్ పొడిచర్మం, ఎర్రగా మారిన బుగ్గలు సమస్యలపై హైడ్రేటింగ్ మాస్క్ సమర్థమైన టెక్నిక్. బయటి నుంచి చర్మాన్ని కాపాడాలంటే హైడ్రేటింగ్ మాస్క్ లు ఉత్తమం.