
Hill Stations: వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి వెళ్లే టాప్ 5 ఉత్తమ హిల్ స్టేషన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎండలు తీవ్రంగా మండుతున్న వేళ, అధిక ఉష్ణోగ్రతల మధ్య ఉపశమనం పొందడానికి చల్లని వాతావరణం కలిగిన ప్రదేశానికి వెళ్లడం ఎంతో అవసరం.
అంతేగాక, పిల్లలకు వేసవి సెలవులు కూడా మొదలవుతున్నాయి కదా! అలాంటప్పుడు వారు ఎప్పుడూ "ఏదైనా మంచి ప్రదేశానికి తీసుకెళ్లండి డాడీ!" లేదా "మమ్మీ, విహారయాత్రకి వెళ్దాం" అంటూ ఉత్సాహంగా అడుగుతుంటారు.
పిల్లలకే కాదు, పెద్దలకూ వేడిలో నుంచి, రోజువారీ ఒత్తిడిలో నుంచి తాత్కాలికంగా తప్పించుకునేందుకు ప్రశాంతమైన, చల్లని ప్రదేశం ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది.
మీకూ అలాంటి ఆలోచన ఉంటే, కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు మంచి హిల్ స్టేషన్‌కి వెళ్లడమే ఉత్తమ ఎంపిక.
వివరాలు
అద్భుతమైన హిల్ స్టేషన్లు ఇవే..
పర్వతప్రాంతాలు సౌందర్యంతో పాటు ప్రశాంతతను కలిగిస్తాయి. నగర జీవన గందరగోళం నుంచి కొంత కాలం విరామంగా ఉంటూ, ప్రకృతి ఒడిలో విశ్రాంతి పొందడం ఒక ప్రత్యేక అనుభూతి.
అలాంటి అనుభూతిని పిల్లలతో పంచుకోవాలంటే, వేసవి సెలవుల్లో వీలైనన్ని రోజులు వాటిని చక్కగా ప్లాన్ చేసుకుని ప్రయాణించాలి.
ఈ నేపథ్యంలో, పిల్లలతో కలిసి వెళ్లవచ్చే అద్భుతమైన హిల్ స్టేషన్లను ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
1) పంచ్‌గని
మహారాష్ట్రలోని పూణెకి సుమారు 100 కి.మీ దూరంలో ఉన్న పంచ్‌గని, చల్లని వాతావరణం,ఆకట్టుకునే పచ్చదనం కారణంగా పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది.
వేసవిలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.సంవత్సరంలో ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని వేలాది మంది సందర్శిస్తారు.
వివరాలు
2) డల్హౌసీ
పిల్లలతో కలిసి సందర్శించదగిన ప్రదేశాలుగా సిడ్నే పాయింట్,టేబుల్ లాండ్ వంటి ప్రకృతి అందాలు,పరాగ్లైడింగ్,బోటింగ్ వంటి యాక్టివిటీలు ఉన్నాయి.
అలాగే ఇక్కడి స్ట్రీట్ ఫుడ్, ప్రత్యేకంగా స్ట్రాబెర్రీ ఫార్ములు ఎంతో ఫేమస్. ప్రకృతి ప్రేమికులకు, కుటుంబ సమేతంగా వెళ్లాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న డల్హౌసీ,సముద్ర మట్టానికి సుమారు 1,970 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రశాంతమైన హిల్ స్టేషన్.
ప్రకృతి ప్రేమికులు,నిశ్శబ్దాన్ని కోరుకునే వారిని ఇక్కడి శాంతత,పచ్చదనం ఆకట్టుకుంటుంది.
బ్రిటిష్ కాల నిర్మాణశైలి,చుట్టూ మంచు కప్పిన పర్వతాలు,పైనస్ చెట్లు,హస్తకళలతో కూడిన షాపింగ్ ఇది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
పిల్లలతో కలిసి ఖజ్జియార్ (ఇండియాలోని మినీ స్విట్జర్లాండ్),కలాటోప్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ, పంచ్ పుల్లా, డైయన్ కుంద్ వంటి ప్రదేశాలు చూడవచ్చు.
వివరాలు
3) ఔలి
చల్లటి వాతావరణంలో ప్రకృతి ప్రేమతో నిండిన ఈ ప్రయాణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.
సముద్ర మట్టానికి సుమారు 2,500 మీటర్ల ఎత్తులో ఉండే ఔలి, ఉత్తరాఖండ్‌లోని స్కీయింగ్ కు ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
ఇక్కడి నుండి హిమాలయాల్లోని నందాదేవి, మాన పర్వత శిఖరాలు కనువిందు చేస్తాయి.
మంచుతో కప్పబడిన ట్రెయిల్స్, ప్రకృతి సౌందర్యం ఇది కుటుంబంతో వేసవి సెలవుల్లో వెళ్లేందుకు బెస్ట్ ఆప్షన్.
రోప్‌వే రైడ్, గోర్సోన్ బగ్‌యాల్ ట్రెక్, నందాదేవి పర్వత దృశ్యాలు, సమీపంలోని ఆధ్యాత్మిక ప్రదేశమైన జోషిమఠ్ వంటి చోట్లకు వెళ్లవచ్చు. ఇది స్కీయింగ్‌కు మాత్రమే కాకుండా ప్రశాంతత కోరే కుటుంబాలకు కూడా సరైన గమ్యం.
వివరాలు
4) ఉటీ
తమిళనాడులోని నీలగిరి కొండలపై ఉన్న ఉటీ, దాని టీ తోటలు,నీలగిరి మౌంటెన్ రైల్వే, శాంతమైన వాతావరణం వల్ల పర్యాటకులకు ఆకర్షణీయంగా మారింది.
ఇక్కడ బోటింగ్ లేక్, కోడైకెనాల్ ఫాల్,రాజ్ భవన్ వంటి ప్రదేశాలు పిల్లలతో కలిసి చూసేందుకు అద్భుతంగా ఉంటాయి.
నీలగిరి రైల్వేలో ప్రయాణించడం ద్వారా సాంకేతిక చరిత్రను అనుభవించవచ్చు. ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా కుటుంబంతో గడిపే సమయానికి ఉటీ ఒక ఉత్తమ గమ్యం.
5) ఐజోల్
మిజోరం రాష్ట్ర రాజధాని అయిన ఐజోల్, సముద్ర మట్టానికి సుమారు 1,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రకృతి నిండి ఉన్న హిల్ స్టేషన్. ఇక్కడి శాంతమైన వాతావరణం,పచ్చని కొండలు, ప్రకృతి మార్గాల్లో ట్రెక్కింగ్ అనుభవం పిల్లలతో కలిసి వెళ్లే వారికి ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది.
వివరాలు
ప్రకృతి అందాలు, చల్లని గాలి, విశ్రాంతి క్షణాలు
ట్యాంగ్‌వాంగ్ ఫారెస్ట్, చాపరియా లేక్, డజల్ వాగ్ ఫాల్ వంటి ప్రదేశాలు ప్రధాన ఆకర్షణలు. ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికీ, కుటుంబంగా విశ్రాంతిగా గడపాలనుకునే వారికీ ఐజోల్ సరైన ఎంపిక.
వేసవి సెలవుల్లో వేడి వాతావరణం నుండి ఉపశమనం పొందేందుకు, పిల్లలతో కలిసి ఆనందించేందుకు, పై హిల్ స్టేషన్లు ఉత్తమ ఎంపికలు.
ప్రకృతి అందాలు, చల్లని గాలి, విశ్రాంతి క్షణాలు -ఇవన్నీ ఒకే చోట మీ కోసం ఎదురు చూస్తున్నాయి!