Loading...
United Nations Day 2026: ప్రపంచ శాంతి కోసం యూఎన్‌ సంస్థ ఏం చేస్తోంది?
ప్రపంచ శాంతి కోసం యూఎన్‌ సంస్థ ఏం చేస్తోంది?

United Nations Day 2026: ప్రపంచ శాంతి కోసం యూఎన్‌ సంస్థ ఏం చేస్తోంది?

వ్రాసిన వారు Balachander Sharma
Oct 24, 2026
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యుద్ధాలు, ఘర్షణలతో నష్టపోయిన ప్రపంచానికి శాంతి, సహకారం అవసరమనే ఆలోచనతో ఏర్పడిన ఐక్యరాజ్యసమితి.. నేటికీ అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి కీలక వేదికగా కొనసాగుతోంది. 2026లో ఈ సంస్థ స్థాపనకు 81 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఈ సంస్థ లక్ష్యాలు ఏమిటి? దాని ప్రధాన అంగాలు ఏవి? ప్రపంచానికి ఇది ఎందుకు అవసరం?

Details

ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం

రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన విధ్వంసం తర్వాత దేశాల మధ్య మరో పెద్ద యుద్ధం జరగకుండా నిరోధించేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రపంచ దేశాలు గుర్తించాయి.

ఈ నేపథ్యంలో 1945 జూన్‌ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితి చార్టర్‌పై సంతకాలు జరిగాయి.

అదే ఏడాది అక్టోబర్‌ 24న చార్టర్‌ అమల్లోకి రావడంతో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఏర్పడింది.

అందుకే ప్రతి ఏడాది అక్టోబర్‌ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటారు.

Details

ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యాలు

ప్రపంచ శాంతి, భద్రతను కాపాడటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. దేశాల మధ్య వివాదాలు యుద్ధాలకు దారితీయకుండా చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది.

మానవ హక్కుల పరిరక్షణ, పేదరికం తగ్గింపు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లోనూ దేశాలకు సహకారం అందిస్తుంది.

2015లో ఆమోదించిన 2030 సుస్థిర అభివృద్ధి అజెండాలో 17 లక్ష్యాలు ఉన్నాయి.

ADVERTISEMENT

Details

ఆరు ప్రధాన అంగాలు

ఐక్యరాజ్యసమితికి ఆరు ప్రధాన అంగాలు ఉన్నాయి. అవి జనరల్‌ అసెంబ్లీ, భద్రతా మండలి, ఆర్థిక-సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సెక్రటేరియట్‌, ట్రస్టీషిప్‌ కౌన్సిల్‌.

వీటిలో భద్రతా మండలికి అంతర్జాతీయ శాంతి, భద్రత విషయంలో ప్రధాన బాధ్యత ఉంటుంది. ఈ మండలిలో 15 సభ్య దేశాలు ఉండగా, చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికాలకు శాశ్వత సభ్యత్వం ఉంది.

ADVERTISEMENT