Vitamin D: విటమిన్ -D పొందడానికి సరైన సమయం ఏదో తెలుసా ?
విటమిన్ -Dని సన్‌షైన్ విటమిన్ అని పిలుస్తారు. ఎందుకంటే మనకు ఈ విటమిన్ ప్రధానంగా సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. ఈ విటమిన్ మన శరీరానికి చాలా అవసరం, ఇది ఎముకలను బలపరచడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడడం, కండరాల నొప్పి, నిరాశ, అలసట వంటి సమస్యలు వస్తాయి. సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు, చర్మంలోని ప్రత్యేక కణాలు ఈ రశ్మిని గ్రహించి విటమిన్ డి గా మార్చుతాయి. శరీరానికి తగినంత విటమిన్ డి పొందడానికి ప్రతిరోజూ 15-20 నిమిషాలు ఎండలో గడపడం మంచిది.
విటమిన్ డి పొందేందుకు ఉత్తమ సమయం
నిపుణుల సూచన ప్రకారం, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. వేసవిలో ఈ సమయం కాస్త కష్టతరమై ఉండొచ్చు, కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఎండలో 10-15 నిమిషాలు గడపడం ద్వారా కూడా తగినంత విటమిన్ డి అందుకోవచ్చు.