
భారతదేశ ప్రజలకు టీ ఎప్పుడు అలవాటయ్యింది? దీని వెనక పెద్ద కథ ఉందని మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
పొద్దున్న లేవగానే టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. టీ తాగకపోతే ఆరోజు ఏదో కోల్పోయామనే ఫీలింగ్ చాలా మందిలో కనిపిస్తుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా?
నిజానికి మొదట్లో మనకు టీ తాగే అలవాటు ఉండేది కాదు. ఈ అలవాటును బ్రిటిష్ వారే పరిచయం చేశారు. దీని వెనక పెద్ద కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
20వ శతాబ్దానికి చెందిన ఆర్థిక వేత్త రోజర్ బాబ్సన్ 1929లో స్టాక్ మార్కెట్ క్రష్ అవుతుందని తెలియజేశారు.
గ్రేట్ డిప్రెషన్ కారణంగా మార్కెట్ చిన్నభిన్నమైపోయి అన్ని రకాల వస్తువులకు డిమాండ్ తగ్గింది. అందులో టీ కూడా ఉంది.
Details
టీ ప్రచారానికి మార్కెటింగ్ ఏజెంట్లు
ఒకపక్క టీ డిమాండ్ బాగా తగ్గిపోయింది. మరోపక్క భారతదేశం, శ్రీలంకలో టీ ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ సమయంలో ఏం చేయాలో బ్రిటిష్ అధికారులకు అర్థం కాలేదు.
అప్పట్లో మహాత్మా గాంధీ ఒకానొక పుస్తకంలో టీ గురించి కొన్ని విషయాలు రాసుకున్నారు. ఆరోగ్యానికి టీ హాని చేస్తుందని ఆ పుస్తకంలో తెలియజేశారు.
బ్రిటీష్ వారి మీద ఉన్న వ్యతిరేకత, టీ పై గాంధీజీ చెప్పిన విషయాలు భారతీయులను టీ వైపు చూడకుండా చేశాయి.
అయితే ఇండియన్ టీ మార్కెట్ ఎక్స్పాన్షన్ బోర్డ్(ITMEB) మాత్రం భారతీయుల్లో టీ తాగే అలవాటును పెంచుతామని బ్రిటీష్ అధికారులకు ప్రామిస్ చేసింది.
అందులో భాగంగానే మార్కెటింగ్ ఏజెంట్లను రిక్రూట్ చేసుకుని బ్రిటీష్ పద్ధతిలో టీ తయారు చేయడం నేర్పించింది.
Details
రైల్వే స్టేషన్లలో టీ ప్రచార చిత్రాలు
ఆ ఏజెంట్లు దేశంలోని వివిధ నగరాల్లో టీ గురించి ప్రచారం చేస్తూ టీ తయారీ విధానాన్ని చూపిస్తూ ఉండేవారు. దేశంలోని ప్రధాన నగరాల్లో టీ కి సంబంధించిన ప్రచార చిత్రాలను అతికించారు.
బస్టాండులు, రైల్వేస్టేషన్లలో టీ కి సంబంధించిన ప్రచార చిత్రాలను గోడలపై వేసేవారు. పశ్చిమ బెంగాల్ లోని డండం రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం నెంబర్ 3పై అప్పటి టీ కి సంబంధించిన ప్రచార చిత్రం ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంది.
టీ గురించి ప్రచారం బాగా పెరగడంతో భారతదేశ ప్రజలు తమ ఇళ్లలో తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.
Details
చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో టీ పౌడర్
అయితే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన రకంగా కాకుండా భారతీయ పద్ధతిలో అల్లం, యాలకులు మొదలైన వాటితో టీ తయారు చేయడం మొదలుపెట్టారు.
ఈ అలవాటు బాగా పెరగడానికి మరో కారణం చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో టీ పౌడర్ అందుబాటులోకి రావడమే. బ్రూక్ బాండ్, లిప్టన్ కంపెనీలు కలకత్తా వంటి నగరాల్లో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో టీ పౌడర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇలా భారతీయులకు టీ అలవాటయింది. అప్పటినుండి టీ మన సంస్కృతిలో ఒక భాగమైయిపోయింది.