
Daniel Jackson: 400 మంది పౌరులతో అన్‌క్లెయిమ్డ్ భూమిపై కొత్త దేశం ఏర్పాటు.. ఎవరి డేనియల్ జాక్సన్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు వార్తల్లోకి ఎక్కాడు.అతని పేరు డేనియల్ జాక్సన్. ఇతను తానే ఓ దేశపు అధ్యక్షుడిని అంటూ ప్రకటించుకొని, "ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్" అనే పేరుతో ఓ స్వతంత్ర దేశాన్ని స్థాపించాడు. ఈ దేశం చాలా చిన్నదే అయినా,ఇప్పటికీ దాదాపు 400 మంది పౌరులు ఉన్నారు. ఇది క్రొయేషియా, సెర్బియా మధ్య డాన్యూబ్ నది ఒడ్డున ఉన్న 125 ఎకరాల వివాదాస్పద అటవీ ప్రాంతంలో స్థాపించబడింది. ఈ అటవీ ప్రాంతం ఎవరి అధీనంలో లేకపోవడం వల్ల ఇదే వీలుగా భావించిన జాక్సన్ ఆ భూమిని తన దేశంగా మార్చేశాడు. ఈ మైక్రో నేషన్‌కు సొంత జెండా ఉంది, కరెన్సీ ఉంది, క్యాబినెట్ కూడా ఉంది.
వివరాలు
క్రొయేషియా, సెర్బియా మధ్య సరిహద్దు వివాదం
20 ఏళ్ల డేనియల్ జాక్సన్ ఈ భూమిని తనదిగా ప్రకటించినప్పుడు, అది అన్‌క్లెయిమ్డ్ భూమి అని తెలుసుకున్నాడట. క్రొయేషియా, సెర్బియా మధ్య సరిహద్దు వివాదం కారణంగా ఆ భూమిని ఎవ్వరూ అధికారికంగా తనదిగా చెప్పుకోలేకపోతున్నారు. ఇదే అదునుగా తనకు వచ్చిన అవకాశాన్నివినియోగించుకున్నాడు జాక్సన్. న్యూయార్క్ పోస్ట్‌లో వచ్చిన కథనం ప్రకారం, అతడు 14 ఏళ్ల వయసులోనే ఈ ఐడియా వచ్చిందట. "అప్పుడు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ప్రయోగంలా మొదలుపెట్టాం. ఏదో పిచ్చిగా, కొత్తగా ఏదైనా సృష్టించాలన్న కల మా అందరిదీ," అని జాక్సన్ చెప్పాడు.
వివరాలు
వెర్డిస్ దేశం ప్రత్యేకత ఏంటి?
డేనియల్ జాక్సన్ ఓ డిజిటల్ డిజైనర్. రోబ్లాక్స్ (Roblox) గేమ్ ప్లాట్‌ఫామ్‌లో వర్చువల్ వరల్డ్స్ డిజైన్ చేసే ఇతను, 18 ఏళ్ల వయసులో వెర్డిస్ ప్రభుత్వానికి పునాది వేశాడు. ఈ దేశం "పాకెట్ త్రీ" అనే పేరుతో గుర్తింపు పొందిన అటవీ ప్రాంతంలో ఉంది. ఇది సుమారు 0.5 చదరపు కిలోమీటర్ల ఎరియాలో విస్తరించి ఉంది. మే 30, 2019న వెర్డిస్‌ను అధికారికంగా స్వతంత్ర దేశంగా ప్రకటించాడు జాక్సన్. ఇది జాక్సన్‌కు చిన్నతనంలో మొదలైన ప్యాషన్ ప్రాజెక్ట్. "దీన్ని మేమంతా మిత్రులుగా కలిసి ఫన్‌గా మొదలుపెట్టాం. పిచ్చిగా ఏదైనా కొత్తగా చేయాలని కలగన్నాం," అని మరోసారి అతను వెల్లడించాడు.
వివరాలు
డేనియల్ జాక్సన్ ఎవరు?
ఈ దేశంలో అధికార భాషలు ఇంగ్లీష్, క్రొయేషియన్, సెర్బియన్ కాగా, కరెన్సీగా యూరోను వాడుతున్నారు. అయితే వెర్డిస్ ప్రాంతానికి వెళ్లాలంటే క్రొయేషియాలోని ఓసీజెక్ నగరం నుంచి బోటు ద్వారా మాత్రమే వెళ్లవచ్చు. అది కూడా చాలా అడ్డంకుల మధ్యనే సాధ్యమవుతోంది. డేనియల్ జాక్సన్ 2004 డిసెంబర్ 7న ఆస్ట్రేలియాలోని అప్పర్ ఫెర్న్‌ట్రీ గల్లి అనే పట్టణంలో జన్మించాడు. మే 30, 2019న ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి అతని పరిపాలన ప్రధానంగా మూడు విషయాలపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ గుర్తింపు పొందడం, నిధులను సమీకరించడం, దేశానికి మౌలిక వసతులను బలోపేతం చేయడం.