
Winter Season : చలికాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బందా.. అయితే ఇవి తినాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
మోకాళ్ల నొప్పులు దీన్నే ఆర్థరైటిస్ అంటారు. దీనికి పూర్తిగా చికిత్స లేదు. మనం తీసుకునే జాగ్రత్తలే ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లవాపు అనేది ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం.
ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, వేర్ అండ్ టియర్ లేదా జన్యుపరమైన కారణాలతో ఇది వస్తుంది. ఈ సమస్య చలికాలంలో చాలా ఎక్కువగా వేధిస్తుంటుంది.
చలికాలంలో చల్లని వాతావరణం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా కీళ్లలో దృఢత్వం తగ్గి నొప్పి తీవ్ర అసౌకర్యంగా మారుతుంది. దీంతో కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి.
ఈ సమయంలో వెచ్చదనం, సున్నితమైన వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయి. ఈ క్రమంలోనే మనం తీసుకునే ఆహారం వ్యాధిపై ప్రభావం చూపిస్తుంది.
సమతుల్యమైన ఆహారం, డైట్లో చేర్చుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Details
మొకాళ్ల నొప్పుల నివారణకు సిట్రస్ ఫ్రూట్స్
సిట్రస్ ఫ్రూట్స్ :
చలికాలంలో నాణ్యంగా లభించే నారింజ, నిమ్మ జాతికి చెందిన సిట్రస్ ఫ్రూట్స్ ఆర్థరైటిస్ సమస్యను దూరం చేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్, కొల్లాజెన్ సంశ్లేషణకు కీలకమైంది. ఇది కీళ్లలోని మృదులాస్థి, బంధన కణజాలల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహకరిస్తుంది.
బొప్పాయి :
బొప్పాయిలో ఉండే పాపైన్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పులు,వాపును తగ్గించడంలో ఉపకరిస్తాయి.ఇందులోని విటమిన్ ఏ,విటమిన్ సీ కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఆరోగ్యాన్నిస్తాయి. కణజాల మరమ్మత్తును ప్రోత్సాహించి,ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పైనాపిల్ :
పైనాపిల్'లో బ్రోమెలైన్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఎంజైమ్లు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. విటమిన్ సి, మాంగనీస్లతో నిండి ఉండి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.
Details
పుచ్చకాయలోను లైకోపీన్
అరటిపండ్లు :
ఆర్థరైటిస్ ఉన్నవాళ్ల అరటిపండ్లు చాలా మంచివి. విలువైన పోషకాలతో నిండిన ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడటంలో సహకరిస్తుంది. కండరాల దృఢత్వాన్ని మెరుగుపరచి, తిమ్మిరిని నిరోధిస్తాయి.
పుచ్చకాయ :
పుచ్చకాయలో ఉండే అధిక నీటి శాతం శరీరాన్నిహైడ్రేటెడ్'గా ఉంచుతుంది.ఇందులోని లైకోపీన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.టమాటాల్లోనూ లైకోపీన్ ఉంటుంది. పుచ్చకాయ సైతం ఇదే సమ్మేళనంతో నిండి ఉంటుంది.
ఇది కీళ్ల ఆరోగ్యానికి సరిపడ హైడ్రేషన్ను సమకూరుస్తుంది. ఫలితంగా నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇక అవకాడో, బెర్రీలు,చెర్రీ వంటి పండ్లు కూడా కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆర్థరైటిస్తో ఇబ్బందులు పడేవారు వైద్యుడ్ని సంప్రదించి ఆయా ఆహారాలను తమ ఆహారంలో భాగం చేసుకుని ఉపశమనం పొందవచ్చు.