Cherry benefits : చలికాలం షురూ.. చెర్రీ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
చెర్రీస్.. ఈ ఆహారంలో వీటిల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. నోరూరించే కేకులు, ఊరగాయలు , జామ్‌లలో ఈ చెర్రీస్ నే ఉపయోగిస్తారు. శీతాకాలం సీజన్‌లో సమృద్ధిగా లభించే చెర్రీల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను శరీరం ఒడిసిపట్టుకోవాలి. తీపితో పాటు కొద్దిగా పుల్లని రుచితో ఉండే ఈ పండ్లు గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. వీటిల్లో సహజంగా రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, పక్షవాతాలను నిరోధిస్తాయి. ఈ చెర్రీస్ ఎముకలకు సైతం మంచి చేస్తుంది. ఇందులోని బోరాన్ ఎముకలను ధృడపరుస్తుంది. ఫలితంగా ఎముక సాంద్రతను పెంచుతుంది. ఎముకల నష్టాన్ని నివారించే గుణాలు ఈ పండులో అనేకం ఉన్నాయి.
ఈ చెర్రీస్.. జట్టు రాలడాన్ని సైతం నివారిస్తుంది
మరోవైపు వృద్ధులకు చెర్రీస్ వల్ల చాలా లాభాలున్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. జలుబు, ఫ్లూ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. శరీరంలోని కణజాలం ఆరోగ్యకరమైన పెరుగుదలను కూడా చెర్రీస్ తోడ్పాటును అందిస్తుంది. జుట్టు పెరుగుదల, చర్మ రక్షణకు సహకరిస్తాయి. చెర్రీస్ అడ్రినల్ గ్రంథి అలసటను నివారిస్తాయి. జుట్టు రాలడాన్నీ నివారిస్తుంది. రేగు పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం నిత్య నూతనంగా యవ్వనంగా మెరుస్తుంటుంది. ఇదే సమయంలో మలబద్ధకం నుంచి కూడా ఇవి ఉపశమనం కలిగిస్తాయి. రేగు పండ్లలో ఇసాటిన్ , సార్బిటాల్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డ్రై ప్లమ్స్ తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం స్థిరంగా కొనసాగుతోంది.