మీ మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలు ఏంటో తెలుసుకోండి
ప్రతీ ఏడాది జులై 22వ తేదీన వరల్డ్ బ్రెయిన్ డే ని జరుపుకుంటారు. మెదడు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని పెంచుకునేందుకు చేయాల్సిన పనులు, వ్యాయామాలు ఏంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యోగా, ధ్యానం నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్రకారం ప్రతిరోజు 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని తేలింది. అంతేకాదు, యోగా చేయడం వల్ల చురుకుదనం, ఫోకస్ పెరుగుతుందని స్పష్టమైంది. అందుకే ప్రతిరోజు యోగా, ధ్యానం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాణాయామం కూడా మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది.
మెదడు పనితీరును పెంచే విజువలైజేషన్
సుడోకు, పజిల్స్, చెస్ పైన పేర్కొన్న గేమ్స్ ఆడటానికి 100% మెదడు ప్రెజెన్స్ ఉండాలి. దీనివల్ల ఫోకస్, నేర్చుకునే లక్షణాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే గుణం పెరుగుతుంది. విజువలైజేషన్: మీ మెదడును మెరుగ్గా పనిచేసేందుకు విజువలైజేషన్ చాలా సహాయపడుతుంది. 2018లో జరిపిన ఒకానొక అధ్యయనం ప్రకారం విజువలైజేషన్ వల్ల సరైన నిర్ణయాలను తీసుకోగలరని నిరూపితమైంది. అయితే విజువలైజేషన్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ముందుగా మీరు ఒక పని చేయాలనుకున్నారు అనుకుందాం. దాన్నెలా చేయాలనుకుంటున్నారో, ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టమైన ఆలోచనకు రావాలి. ఇలా ప్రతి విషయంలో ప్రాక్టీస్ చేస్తే విజువలైజేషన్ అలవాటవుతుంది. వంటచేయడం వల్ల కూడా మెదడు పనితీరు మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.