Year Ender 2024:గులాబ్ జామున్ చాట్ నుండి మటన్ కీమా కేక్ వరకు..2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన రెసిపీస్ ఇవే..!
2024వ సంవత్సరం ముగింపుకు ఇంకా కొద్దిరోజులే ఉంది . ఈ ఏడాది చాలా వింతలు, ఆశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, సోషల్ మీడియాలో ఎవరికీ ఊహించనివంటి వంటకాలు వైరల్‌గా మారాయి. ఈ వంటకాలు కొన్ని నవ్వు తెప్పించగా, మరికొన్నింటిని చూసి జనాలు అసహ్యంతో తల పట్టుకున్నారు. ఇంకొంతమంది మాత్రం ఈ రకమైన వంటకాలున్నాయా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు 2024లో సోషల్ మీడియాను ఊపేసిన ఆ వింత వంటకాలపై ఓ దృష్టి పడిద్దాం.
చాక్లెట్ పాస్తా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటాలియన్ పాస్తాకు కొత్త మలుపు ఇస్తూ, చాక్లెట్ పాస్తా రూపుదిద్దుకుంది. కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి ఈ వంటకం తయారు చేశారు. ఈ వంటకం చూసిన జనాలు కాస్త షాక్ తిన్నారు. చాక్లెట్ గ్రీన్ పీస్ ఫుడ్‌మేకేస్కల్‌హ్యాపీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చాక్లెట్‌తో కూడిన గ్రీన్ పీస్ రెసిపీ వైరల్ అయ్యింది. ఒక చాక్లెట్‌ను మైక్రోవేవ్ బౌల్‌లో ఉంచి, దానిలో బఠానీలు జోడించి, మైక్రోవేవ్‌లో ఉడికించారు. ఆ ఫుడ్ బ్లాగర్ దీన్ని ఆనందంగా తినడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
మటన్ కీమా కేక్
సాధారణంగా చాక్లెట్, పైనాపిల్, బటర్‌స్కాచ్ వంటి కేక్‌లు చూడడం మామూలే. కానీ తమిళనాడుకు చెందిన ఒక బేకర్ మటన్ కీమా కేక్‌ను తయారు చేశారు. మటన్ మిన్స్‌ను స్పాంజ్ కేక్‌పై స్ప్రెడ్ చేసి, ఫ్రెష్ క్రీమ్‌తో అలంకరించి, రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అందంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసినవారు విస్తుపోయారు. గుడ్డు హల్వా: సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో వింత వంటకం కోడిగుడ్డు హల్వా. గుడ్లను గిలక్కొట్టి, చక్కెర, పాలపొడి జోడించి, బ్లెండర్‌తో మెత్తగా చేసి, స్టవ్‌పై ఉడికించి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ జతచేశారు. ఇది చూసిన జనాలు తట్టుకోలేకపోయారు.
గులాబ్ జామున్ చాట్
గులాబ్ జామున్, చాట్—ఈ రెండు విభిన్న వంటకాల కలయిక సోషల్ మీడియాలో నవ్వులు పుట్టించింది. గులాబ్ జామున్‌పై పెరుగు, చింతపండు చట్నీ వేసి తయారు చేసిన ఈ చాట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత వంటకాలు 2024లో నెటిజన్లను ఆశ్చర్యానికి, నవ్వులకు గురిచేశాయి.