చంద్రయాన్-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రయోగాన్ని అవహేళన చేశారని కొందరు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతకర ట్వీట్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
చంద్రయాన్-3 కీలక దశకు చేరుకున్న సందర్భంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపుతున్న తొలి ఫొటో ఇదే అన్న రీతిలో ఓ వ్యక్తి ఛాయ్ తయారు చేస్తున్న ఫొటోను జోడించారు.
ఇది మోదీని ఉద్దేశించే పోస్ట్ చేసినట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. భారత ప్రగతిని సహించలేకే ఇలా వ్యంగస్త్రాలు సంధిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ఇదే..
BREAKING NEWS:-
— Prakash Raj (@prakashraaj) August 20, 2023
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G