'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అంటూ వార్తలు.. ఇస్రో ట్వీట్‌తో క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఇదే సమయంలో మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ మంగళవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
తాజాగా ఇస్రో ప్రకటనతో ఆ వార్తలు అవాస్తవమని తెలింది. ఆగస్ట్ 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై చంద్రయాన్-3 మిషన్ సేఫ్‌గా ల్యాండ్ కానున్నట్లు ఇస్రో తెలిపింది.
ఈ క్రమంలోనే చంద్రుడికి 70 కి.మీ ఎత్తు నుంచి ల్యాండర్ పోజిషన్ డిటెక్షన్ కెమెరా తీసిన ఫోటోలను ఇస్రో షేర్ చేసింది.
అంతేకాదు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగే స్థలాన్ని కూడా ఇస్రో ఖరారు చేసింది.
details
అంతా అనుకున్నట్లే జరుగుతోంది: ఇస్రో
ప్రస్తుతం అంతా అనుకున్నట్లే జరుగుతోందని, చంద్రుడి ఉపరితం చాలా కఠినంగా ఉంటుందని, పెద్ద పర్వతాలు ఉన్నాయని ఇస్రో పేర్కొంది.
పలు ప్రాంతాల్లో మైనస్ 300 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోందని ఇస్రో వివరించింది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి ఉండదని, దీంతో ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ సవాల్‌గా మారతుందని తెలిపింది.
అంతకుముందు ఇస్రో తరఫున ఓ కీలక ప్రకటన వెలువడింది. రేపు(ఆగస్ట్ 23న) పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకెళ్తామని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం.దేశాయ్ వెల్లడించారు.
ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ప్రతికూలంగా ఉంటే ల్యాండింగ్ ని మరో తేదీకి వాయిదా వేస్తామన్నారు.
నీలేష్ దేశాయ్ వ్యాఖ్యల ఆధారంగా జాతీయ మీడియా చంద్రయాన్-3 ల్యాండింగ్ అలస్యంపై వార్తలు రాసుకొచ్చాయి.