Page Loader
ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్
చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్

ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీలో కొత్త క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్ 'కోడెక్స్'ను ప్రారంభించింది. ఈ కొత్త టూల్ రాయడం, బగ్స్ సరిచేయడం, యూజర్ కోడ్ బేస్ గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి కోడింగ్ సంబంధిత పనులను ఒకేసారి నిర్వహించగలదు. ప్రతి టాస్క్ కోసం ప్రత్యేకమైన శాండ్‌బాక్స్ (ప్రైవేట్ కోడింగ్ ఎన్విరాన్‌మెంట్)ను ఉపయోగిస్తుంది. కోడెక్స్ ఓపెన్‌ఏఐ తాజా రీజనింగ్ మోడల్ 'ఓ3' పై ఆధారపడి రూపొందించారు. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పనుల కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడి ఉంది. మానవ శైలిలో, పీఆర్ ప్రాధాన్యతలను బాగా ప్రతిబింబిస్తూ, సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ, పూర్తి పరీక్షల వరకు కోడ్ సృష్టించగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఓపెన్‌ఏఐ పేర్కొంది.

Details

ఎంటర్‌ప్రైజ్, టీమ్ వినియోగదారులకు అందుబాటులోకి

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మెన్ ఈ కోడెక్స్ విడుదలను 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ప్రకటించి, ఇలాంటి టూల్స్ ద్వారా వ్యక్తి ఎంత సాఫ్ట్‌వేర్ సృష్టించగలడో తెలుసుకోవడం ఆశ్చర్యకరం, ఉత్తేజకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కోడెక్స్ చాట్‌జీపీటీ ప్రో, ఎంటర్‌ప్రైజ్, టీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో ప్లస్, ఎడ్యు వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ జత చేశారు. కోడెక్స్ వినియోగదారులు చాట్‌జీపీటీ సైడ్‌బార్ లోకి వెళ్లి, ప్రాంప్ట్ టైప్ చేసి 'కోడ్' పై క్లిక్ చేయడం ద్వారా ఏఐ ఏజెంట్‌కు కోడింగ్ పనులను కేటాయించవచ్చు.

Details

కోడెక్స్ ఫైళ్లను చదవగలదు, ఎడిట్ చేయగలదు

అలాగే కోడ్ బేస్ పై ప్రశ్నలు అడగడానికీ 'ఆస్క్' బటన్ ద్వారా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు. ఓపెన్‌ఏఐ ప్రకారం, కోడెక్స్ ఫైళ్లను చదవగలదు, ఎడిట్ చేయగలదు, టెస్ట్ హార్నెస్‌లు, లింటర్లు, టైప్ చెకర్లు వంటి ఆదేశాలను అమలు చేయగలదు. పనుల పూర్తి కాలం సాధారణంగా 1 నుండి 30 నిమిషాల మధ్య ఉంటుంది, మరియు యూజర్లు పనితీరును రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. పని పూర్తయ్యాక, కోడెక్స్ టెర్మినల్ లాగ్‌లు, టెస్ట్ ఔట్‌పుట్‌ల ద్వారా ఫలితాలను ధృవీకరించే సైటేషన్లు కూడా అందిస్తుంది. డీప్ రీసెర్చ్, ఆపరేటర్ తరువాత ఈ ఏడాదిలో ఓపెన్‌ఏఐ విడుదల చేసిన మూడవ ఏఐ ఏజెంట్ ఇదే కోడెక్స్.