
WhatsApp Users: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక! హ్యాకర్లు మీ సున్నితమైన డేటాను దొంగిలించవచ్చు: సురక్షితంగా ఎలా ఉండాలంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
మీ కంప్యూటర్‌లో ఇంకా పాత వెర్షన్ వాట్సాప్ డెస్క్‌టాప్ వాడుతున్నారా? అయితే ఇది మీ వ్యక్తిగత సమాచారం కోసం సైబర్ నేరగాళ్లకు తలుపులు తెరిచే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
మరి, ఈ ముప్పు నుంచి ఎలా రక్షణ పొందాలో తెలుసుకుందాం.
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక
వాట్సాప్ వినియోగదారులకు కీలక హెచ్చరిక వచ్చింది. మీరు వాడుతున్న కంప్యూటర్ భద్రమేనా? లేదంటే మీ ప్రైవసీ ప్రమాదంలో ఉందని భారతదేశ సైబర్ భద్రతా సంస్థ CERT-In (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) వెల్లడించింది.
ముఖ్యంగా డెస్క్‌టాప్ ద్వారా వాట్సాప్ వాడుతున్న వారికి ఇది అత్యవసర అలర్ట్.
వివరాలు
పాత వెర్షన్‌లలో తీవ్ర భద్రతా లోపం
CERT-In తెలిపిన ప్రకారం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతున్న పాత వెర్షన్ వాట్సాప్ డెస్క్‌టాప్‌లో ప్రమాదకరమైన భద్రతా లోపం కనుగొనబడింది.
ఈ లోపాన్ని దుర్వినియోగం చేసుకుని హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాను దొంగలించవచ్చు, లేదా మీ కంప్యూటర్‌ను పూర్తిగా నియంత్రించగలుగుతారు.
సూచించినట్టు, ఈ లోపం వల్ల హ్యాకర్లు తమకు కావాల్సిన కోడ్‌ను మీ కంప్యూటర్‌లో రన్ చేయగలుగుతారు.
ముఖ్యంగా 2.2450.6 కంటే పాత వర్షన్‌ల విండోస్ కంప్యూటర్లకు ఇది మరింత ప్రమాదకరం.
వివరాలు
లోపానికి కారణం - అటాచ్‌మెంట్ లోపం
ఈ భద్రతా లోపం కారణంగా, MIME టైప్,ఫైల్ ఎక్స్‌టెన్షన్ మధ్య సరైన కాన్ఫిగరేషన్ లేకపోవడం వల్ల, కొన్ని ప్రమాదకరమైన ఫైల్స్‌ను ఓపెన్ చేసినప్పుడు హ్యాకర్లు ఆర్బిటరీ కోడ్‌ను రన్ చేయగలుగుతారు.
ముఖ్యంగా వాట్సాప్‌లో మాన్యువల్‌గా ఓపెన్ చేసే అటాచ్‌మెంట్‌లు ఈ సమస్యకు దారి తీస్తున్నాయి.
వివరాలు
ఈ ముప్పు నుంచి ఎలా తప్పించుకోవచ్చు?
మీ డివైజ్‌ను సురక్షితంగా ఉంచాలంటే, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది:
వాట్సాప్ డెస్క్‌టాప్‌ను 2.2450.6 లేదా అంతకంటే తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫైల్స్ లేదా అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయవద్దు.
మీ ఆపరేటింగ్ సిస్టమ్,యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను తరచుగా అప్‌డేట్ చేస్తూ ఉండండి.
అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, తెలియని ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం మానేయండి.
వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు ఎప్పుడూ మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.
ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు హ్యాకర్లను దూరంగా ఉంచుతూ, మీ కంప్యూటర్‌తో పాటు వ్యక్తిగత సమాచారం కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు.