భారత్ లాగే ఎమర్జెన్సీ మొబైల్ అలెర్ట్ సిస్టమ్ ను పరీక్షించిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికా అత్యవసర సెల్ ఫోన్ సిగ్నలింగ్ అలెర్ట్ సిస్టమ్ ను బుధవారం పరీక్షించింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు అమెరికా ఫోన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజీలు వెల్లువెత్తాయి. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA), ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (FCC) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. విపత్తులు సంభవించే క్రమంలో సమయానుకూలంగా, సమర్థవంతంగా కమ్యూనికేషన్ అందించడమే లక్ష్యంగా ఈ పరీక్షలు జరిపారు. దీంతో అమెరికా టీవీలు, రేడియోలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా లక్షలాది అమెరికన్ల సెల్ ఫోన్లు మోత మోగాయి. ఇటీవలే భారతదేశం సైతం ఇలాంటి పరీక్షే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్‌లలో టెస్ట్ ఫ్లాష్‌ను పంపడం ద్వారా అత్యవసర హెచ్చరిక వ్యవస్థను పరీక్షించింది.
అమెరికాలో సెల్ ఫోన్లకు వెల్లువెత్తిన ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజీలు
TOMORROW, OCT. 4: There will be a nationwide emergency alert test sent to all TVs, radios, and cell phones at 2:20 p.m. ET. Important information and what can be expected from the nationwide test: https://t.co/2yv5y297wb Frequently Asked Questions ⤵️ pic.twitter.com/gWjCynM8zb— FEMA (@fema) October 3, 2023