ఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు
అమెరికా ఖగోళ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ అద్భుతం చేశారు. చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో ఫుల్ క్లారిటీతో తన కెమెరాలో బంధించేశాడు. గట్టిపడిన లావా సరస్సులు, లావా ట్యూబ్‌లు, శాశ్వతంగా నీడతో నిండిన లోయలు, ఇక చంద్రుడి ఉపతరిలం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రుడు ఉపరితలంపై ఉన్న చిన్న తేడాలను మనం మనం ఫోటోలో చూడవచ్చు. ఆండ్రూ మెక్‌కార్తీ ఒక్కో ఫోటోను గిగాపిక్సెల్ క్లారిటీతో తీశాడంటే అవి ఎంత క్లారిటీతో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండు టెలిస్కోప్‌లను మెక్‌కార్తీ ఫోటోలను తీశారు. ఏకంగా 280,000 ఫోటోలు తీసి, చంద్రుడి ప్రతి కోణాన్ని ఆయన తీయగలిగాడు.
ఫోటో ఎడిటింగ్ సమయంలో డజను సార్లు కంప్యూటర్ క్రాష్
ఒక్కో ఫోటో సైజు జీబీల్లో ఉండటంతో ఎడిటింగ్ ప్రక్రియలో తన కంప్యూటర్ కనీసం డజను సార్లు క్రాష్ అయ్యిందని మెక్‌కార్తీ చెప్పాడు. ఈ మేరకు మెక్‌కార్తీ ట్వీట్ చేశారు. చంద్రుడితో పాటు, వీనస్, సన్ నెబ్యులాస్, విశ్వంలోని ఇతర అద్భుతమైన షాట్‌లను కూడా తీశాడు. మార్స్ పరిమాణంలో ఉన్న వస్తువు భూమిని ఢీకొనడంతో చంద్రుడు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న 200చంద్రులలో భూమి చుట్టూ తిరిగే చంద్రుడు పరిమాణంలో ఐదోస్థానంలో ఉండటం గమనార్హం. 1610లో బృహస్పతి చుట్టూ తిరుగుతున్న నాలుగు చంద్రులను గెలీలియో గెలీలీ కనిపెట్టే వరకు ఇతర చంద్రుల గురించి ప్రజలకు తెలియదు.