Loading...
Anthropic IPO: ఆంత్రోపిక్‌ ఐపీఓతో కృష్ణారావుకు రూ.7,000 కోట్లు.. అసలు ఎవరీయన?
ఆంత్రోపిక్‌ ఐపీఓతో కృష్ణారావుకు రూ.7,000 కోట్లు.. అసలు ఎవరీయన?

Anthropic IPO: ఆంత్రోపిక్‌ ఐపీఓతో కృష్ణారావుకు రూ.7,000 కోట్లు.. అసలు ఎవరీయన?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

Claude AIని రూపొందించిన ఆంత్రోపిక్‌ సంస్థ ఐపీఓకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ కంపెనీ CFO కృష్ణారావు పేరు ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారింది. కంపెనీ ప్రతిపాదిత ఐపీఓ విలువ 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చన్న అంచనాల మధ్య, రావు వద్ద ఉన్న స్టాక్ ఆప్షన్ల విలువ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఐపీఓ ధర గరిష్ఠంగా $78 వద్ద నిర్ణయిస్తే, ఆయన సంపద దాదాపు రూ.6,965.76 కోట్లు, అంటే సుమారు రూ.7,000 కోట్లకు చేరొచ్చని లెక్కలు చెబుతున్నాయి.

Details

94.97 లక్షల షేర్లే అసలు కథ

2026 సెప్టెంబర్ 30 నాటికి కృష్ణారావు వద్ద Anthropicకు చెందిన 94.97 లక్షల షేర్లు ఉన్నట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌ (SEC)కి సమర్పించిన కంపెనీ రిజిస్ట్రేషన్‌ వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఆయన ఈ షేర్లకు చెల్లించాల్సిన ఎక్సర్‌సైజ్‌ ధర ఒక్కో షేరుకు కేవలం $1.30. అదే ఐపీఓ ధర $74 స్థాయికి చేరితే, ఈ స్టాక్ ఆప్షన్ల విలువలో దాదాపు 5,600 శాతం పెరుగుదల కనిపించొచ్చని అంచనా.

అంటే కంపెనీ మార్కెట్‌లో అడుగుపెట్టడం రావుకు వ్యక్తిగతంగా భారీ ఆర్థిక ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది.

Details

ఎవరీ కృష్ణారావు?

కృష్ణారావు 2024 ఏప్రిల్‌ నుంచి Anthropic CFOగా పనిచేస్తున్నారు. అంతకుముందు Fanatics Commerceలో CFOగా బాధ్యతలు నిర్వహించారు.

Airbnbలో 2015 నుంచి 2021 వరకు గ్లోబల్ హెడ్ ఆఫ్ కార్పొరేట్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ వంటి కీలక పదవుల్లో పనిచేశారు.

అంతకుముందు Bainలో స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. Yale Law Schoolలో JD, Harvard Collegeలో ఎకనామిక్స్‌లో AB చదివారు.

ఐపీఓ ప్రక్రియపై ఆయనకు ఉన్న అనుభవం కూడా Anthropicకు కీలకంగా మారింది.

ADVERTISEMENT