Page Loader
Cupola: కుపోలా.. అంతరిక్షంలోంచి ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన కిటికీ!
కుపోలా.. అంతరిక్షంలోంచి ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన కిటికీ!

Cupola: కుపోలా.. అంతరిక్షంలోంచి ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన కిటికీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

మన ఇంట్లోని కిటికీ ద్వారా కేవలం వీధి దాకా మాత్రమే కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ ప్రత్యేక కిటికీ ద్వారా మానవుడు భూమి మొత్తాన్ని, అంతరిక్ష విహంగమయ్యే దృశ్యాలను కూడా వీక్షించగలడు. ఈ అద్భుత విండో పేరు "కుపోలా". భూమి నుండి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇది భాగంగా ఉంది. వ్యోమగాములు దీనివద్దకు చేరినప్పుడు, భూమి అందాన్ని చూసి అబ్బురపడిపోతారు. "కుపోలా" అనే పదం ఇటాలియన్ భాషలో "గుమ్మడిదానంలాంటి గుడారం" లేదా "డోమ్" అనే అర్థాన్ని కలిగి ఉంటుంది.

వివరాలు 

1990వ దశకంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం

1990వ దశకంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో అనేక మాడ్యూల్స్ ఉన్నప్పటికీ, 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్‌ ద్వారా ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్‌ ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించబడింది. అదే సమయంలో, కుపోలా అనే ప్రత్యేక గాజు గదినీ పంపించారు. ఇది 2.95 మీటర్ల వ్యాసం, 1.5 మీటర్ల ఎత్తుతో ఉండే ఆకారంలో ఉంటుంది. దీని బరువు సుమారు 1,880 కిలోలుగా ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద అద్దపు విండో, దాని చుట్టూ ఆరు చిన్న కిటికీలు ఉండేలా పుష్పాకార ఆకృతిలో రూపొందించబడింది. ఈ మధ్య అద్దపు కిటికీ వ్యాసం 80 సెంటీమీటర్లుంటుంది. 2025 ఫిబ్రవరిలో కుపోలా ఐఎస్‌ఎస్‌లో చేరి 15 ఏళ్లు పూర్తయినట్లు అయింది.

వివరాలు 

నాసా వెనక్కి తగ్గినా... ఐరోపా ముందుకొచ్చింది 

కుపోలా విండో ఏర్పాటు చేసేందుకు తొలుత నాసా, బోయింగ్ సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాయి. అయితే ఖర్చుల నియంత్రణ నిమిత్తం ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసాయి. అప్పట్లో నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ఆధారంగా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) 1998లో దీన్ని తన భాద్యతగా తీసుకుంది. ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని రూపకల్పన, అభివృద్ధి, అంతర్గత నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది.

వివరాలు 

ఉల్కల నుండి సురక్షితంగా 

కుపోలా విండోలపై అంతరిక్షంలో తూళ్ళే శకలాలు, ఉల్కల వల్ల హాని కలగకుండా, ప్రత్యేకమైన షట్టర్లు అమర్చారు. వీటిని నాబ్ సహాయంతో మాత్రమే తెరవవచ్చు. అవసరమైనప్పుడే ఇవి తెరవబడతాయి. ఈ విండో ద్వారా అంతరిక్ష కేంద్రం బయట భాగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అంతే కాకుండా, రోబోటిక్ చేతుల కదలికలను గమనించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక విధులు లేని సమయంలో వ్యోమగాములు ఇక్కడికి వచ్చి భూమి మరియు అంతరిక్ష అందాలను వీక్షిస్తూ విశ్రాంతి తీసుకుంటారు. "కుపోలా అనేది వ్యోమగాములను భూమితల్లితో మానసికంగా అనుసంధానించే నాళములాంటి అద్భుతం" అని ఈ ప్రాజెక్టును నిర్మించిన ఐరోపా సంస్థ ఎలినియా స్పాజియోకు చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ డోరియాన్ బఫ్ అన్నారు.

వివరాలు 

భారత వ్యోమగామి శుభాంశు ప్రయోగాలు 

ఈ శనివారం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కుపోలా విండో వద్ద పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంలో తీసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.