Page Loader
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా.. వాతావరణం,సాంకేతిక లోపాలే కారణం 

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా.. వాతావరణం,సాంకేతిక లోపాలే కారణం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

స్పేస్‌-X కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. ఇది నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ఆక్సియమ్-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా జరగాల్సిన ప్రయోగం. ఆ ప్రణాళిక ప్రకారం జూన్ 10, మంగళవారం ఉదయం 8:22కి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ శ్రీ నారాయణన్ వెల్లడించారు. వాతావరణ కారణాల తరువాత,జూన్ 11 బుధవారం రోజున ప్రయోగం జరపాలని నిర్ణయించినా, ఈసారి సాంకేతిక సమస్య ఎదురైంది.

వివరాలు 

ఏడు ప్రయోగాలు ప్రత్యేకంగా ఇస్రో రూపొందించినవి

శాస్త్రవేత్తల ప్రకారం,రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ ఏర్పడిందని గుర్తించారు. ఈ కారణంగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని స్పేస్‌ఎక్స్ స్పష్టం చేసింది. ఈ మిషన్ మొత్తం 14 రోజుల పాటు కొనసాగనుంది. దీనిలో భాగంగా నాలుగు మంది అంతరిక్షయానికీ వెళ్లనున్నారు. వారు మొత్తం 60 ప్రయోగాలను నిర్వహించనున్నారు. అందులో ఏడు ప్రయోగాలు ప్రత్యేకంగా ఇస్రో రూపొందించినవిగా ఉంటాయి. ఈ మిషన్‌లో ప్రధాన ఆకర్షణ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా. అతడిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు పంపేందుకు ఈ ప్రయోగం కీలకంగా మారుతుంది. బుధవారం నాటికి అతడి ప్రయాణాన్ని షెడ్యూల్ చేసినప్పటికీ, తాజా వాయిదా వల్ల అది కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్