Page Loader
Increase Prices: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న OpenAI.. చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న OpenAI.. చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు

Increase Prices: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న OpenAI.. చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2024
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

OpenAI సంస్థ 2029 నాటికి చాట్‌జీపీటి సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు చేయాలని చూస్తోంది. ఏఐ రంగంలో ప్రముఖమైన ఈ సంస్థ తన చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం ధరల పెంపు ప్రణాళికలను పరిశీలిస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం నెలకు $20గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ రుసుమును ఈ ఏడాది చివరినాటికి $22కి పెంచే యోచనలో ఉంది. ఇది 2029 నాటికి సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు $44కి పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Details

రేట్లపై వినియోగదారుల అసంతృప్తి

OpenAI తన ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి ఈ ధరల పెంపు చేపడుతోంది. గత నెలలో సంస్థ $300 మిలియన్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది $5 బిలియన్ల నష్టాన్ని ఎదుర్కొంటుంది. AI శిక్షణ, కార్యాలయ నిర్వహణ, నియామకాలు వంటి ఖర్చులు సంస్థ మీద ప్రభావం చూపాయి. ఇప్పటికే 10 మిలియన్ల మంది వినియోగదారులు చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు $20 రుసుము ఎక్కువగానే ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు రేట్లు పెంచితే వినియోగదారుల నుంచి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.