Page Loader
Chadrayaan-3: చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత వివరాలను వెల్లడించిన చంద్రయాన్-3 రోవర్
జాబిల్లిపై రోవర్ పరిశోధనలు

Chadrayaan-3: చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత వివరాలను వెల్లడించిన చంద్రయాన్-3 రోవర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 27, 2023
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాబిల్లి ఉపరితలంపై 10సెం.మీ లోతు వరకు చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు చంద్రుడి దక్షిణ ధృవం ఉష్ణోగ్రత సమాచారాన్ని రోవర్ ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి ఉష్ణోగ్రత వివరాలను, వాటి హెచ్చుతగ్గులపై డేటాను తెలుసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. శనివారం శివశక్తి పాయింట్ వద్ద ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుంది. ఈ క్రమంలోనే అధ్యయనాలను కొనసాగిస్తోంది. ChaSTE (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ చందమామ ఉపరితలంపై ఉష్ణోగ్రతలను పరిశోధిస్తోంది. ఈ గ్రాఫ్‌లో జాబిల్లిపై ఉపరితలం ఉష్ణోగ్రత-10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు చూపించింది. మరిన్ని లోతైన పరిశీలనలు కొనసాగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది.

DETAILS

చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్‌లు ఉన్నాయి

మరోవైపు ఈ గ్రాఫ్‌ చంద్రుడి ఉపరితలంపై లోతులో ఏర్పడే తేడాల ప్రకారం ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-3 ఉపగ్రహంలో మొతం ఏడు పేలోడ్‌లు ఉన్నాయి. వాటిలో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహిస్తున్నాయి. ప్రపల్షన్ మాడ్యూల్ ఒక పే లోడ్ నిర్వహిస్తోంది. ఈ ఏడు పేలోడ్‌లు ఒక్కొక్కటీ పలురకాల శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. జాబిల్లి నేలపై రిసెర్చ్ చేస్తున్న ChaSTE కాకుండా, విక్రమ్‌లోని RAMBHA (అయాన్‌లు, ఎలక్ట్రాన్‌లను అధ్యయనం చేసేందుకు), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేసేందుకు), LRA (జాబిల్లి గతిశీలతను అర్థం చేసుకునేందుకు) ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం) నిర్దేశించింది.