చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఆఖరి టార్గెట్‌పై మిషన్ ఫోకస్
చందమామ ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ నడయాడుతోంది.ఈ మేరకు ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ చందమామపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై నడుస్తూ డేటాను సేకరించే పనిలో నిమగ్నమైంది. 14రోజుల పాటు రోవర్ పరిశోధనా ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండు లక్ష్యాలను ఇప్పటికే పూర్తయ్యాయి. 1. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం 2. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా కలియతిరుగుతోంది. 3. ఇక మూడోది శాస్త్రీయ పరిశోధన ప్రక్రియ కొనసాగుతోంది. ల్యాండర్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు సక్రమంగా పనిచేస్తున్నట్లు ఇటీవలే ఇస్రో వెల్లడించింది. ల్యాండర్ దిగిన ప్రదేశం శివశక్తి వద్ద రోవర్ రహస్యాలను చేధించే పనిలో ఉంది.