
ChatGPT: చాట్‌జీపీటీ సాయం.. ఉత్తర కొరియా హ్యాకర్లు ఫిషింగ్ దాడుల్లో వినూత్న వ్యూహం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ చాట్‌జీపీటీ ఉపయోగించడం గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో కలకలం రేపుతోంది. సైబర్ నిపుణుల ప్రకారం హ్యాకర్లు దక్షిణ కొరియా మిలిటరీ గుర్తింపు కార్డుల నకిలీ ముసాయిదాలను తయారుచేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వినియోగించారు. ఈ ముసాయిదా నిజమైనది అని నమ్మించడానికి, అవతలి వ్యక్తులు పొందగానే వారి డేటాను దొంగిలించేందుకు రూపొందించబడినట్లు జీనియన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ దాడికి 'కిమ్‌సుకీ' బృందం బాధ్యత వహించింది. ఈ కిమ్ (KIM) ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ ముఠా గతంలోనూ అనేకసార్లు దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.
Details
ఫేక్ ఐడీలు సృష్టి
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ ఈ విషయంపై గతంలో హెచ్చరించింది. ఈ ముఠాకు ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని, ప్రపంచవ్యాప్తంగా నిఘా సమాచారాన్ని సేకరించడం వారి ప్రధాన పని అని తెలిపింది. జూలైలో జీనియన్స్ పరిశోధనలో, హ్యాకర్లు చాట్‌జీపీటీని ఫేక్ ఐడీలను సృష్టించమని అడిగినప్పుడు అది తొలుత నిరాకరించిందని తెలిసింది. తరువాత ప్రాప్టింగ్ మార్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళినట్లు తెలిసింది. అదేవిధంగా ఆగస్టులో 'ఆంత్రోపిక్' కూడా ఉత్తర కొరియా హ్యాకర్లు క్లాడ్ కోడ్ టూల్స్ వినియోగిస్తున్నారని హెచ్చరించింది. దీని ద్వారా యూఎస్ ఫార్చూన్ 500 కంపెనీల్లో రిమోట్‌గా నియమితులుగా హ్యాకర్లు పనిచేస్తున్నారని, వారికి నకిలీ గుర్తింపులు, పాస్ కోడింగ్ అసెస్‌మెంట్లు తయారు చేయడంలో క్లాడ్ సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
Details
ఉత్తర కొరియా అకౌంట్లను నిషేధించినట్లు ప్రకటన
ఇప్పటివరకు ఫిషింగ్ లక్ష్యాల్లో జర్నలిస్టులు, పరిశోధకులు, మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు. సౌత్ కొరియా నుంచి వచ్చిన మిలిటరీ మెయిల్ లాగా నకిలీ మెయిల్స్ పంపి వారికి నష్టం కలిగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, ఇప్పటివరకు ఎంతమంది సైబర్ బాధితులు ఉన్నారన్నది వెల్లడించబడలేదు. ఉత్తర కొరియా హ్యాకర్లు తమ AI టూల్స్ వినియోగిస్తున్నారని స్పందించడానికి ఓపెన్‌ఏఐ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. గతంలో ఫిబ్రవరిలో, నకిలీ రెజ్యూమోలు, కవర్ లెటర్లు, సోషల్ మీడియా పోస్టులు రూపొందిస్తున్న అనుమానిత ఉత్తర కొరియా అకౌంట్లను నిషేధించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది.