
Pig Liver: బ్రెయిన్ డెడ్ మనిషి శరీరంలో పంది కాలేయం.. చైనా వైద్యుల మరో విప్లవాత్మక ప్రయోగం!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరంలో పంది కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. ఈ ప్రకటించారు చైనా వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.
మానవ శరీరానికి అనుకూలంగా ఉండేలా జన్యు మార్పులు చేసిన ఒక ప్రత్యేకమైన పంది కాలేయాన్ని వైద్యులు సేకరించి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరంలోకి మార్పిడి చేశారు.
గతంలో అమెరికా వైద్యులు కూడా పంది మూత్రపిండాలు, గుండెను విజయవంతంగా అమర్చారు.
అయితే, కాలేయ దాతల కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, మానవులకు దీని ద్వారా మార్గసూచీ లభిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
నిరంతర వైద్య పర్యవేక్షణ
"జన్యు మార్పులు చేసిన పందుల అవయవాలను తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగులకు తాత్కాలికంగా అమర్చితే, మానవ కాలేయ దాత లభించే వరకు అది ఉపయోగపడే అవకాశం ఉంది. పంది కాలేయాన్ని అమర్చిన వ్యక్తిని 10 రోజుల పాటు నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచి, కాలేయ పనితీరు, మానవ శరీరం స్పందనను గమనిస్తున్నాం. ప్రస్తుతం ఇది సక్రమంగా పనిచేస్తోంది" అని జియాన్ నాల్గవ మిలిటరీ మెడికల్ యూనివర్సిటీ వైద్యులు తెలిపారు:
వివరాలు
గుండె వైఫల్యం చెందడంతో మృతి చెందిన వ్యక్తి
ఈ ప్రయోగం కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పెద్ద స్థాయిలో ప్రయోజనాన్ని అందిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
గతంలో అమెరికా వైద్యులు పంది గుండెను విజయవంతంగా అమర్చగా, ఆ వ్యక్తి 40 రోజుల వరకు ఆరోగ్యంగా ఉండి, ఆపై గుండె వైఫల్యంతో మరణించాడు.
ఈ ప్రక్రియను మేరీల్యాండ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధికారికంగా వెల్లడించింది.
ఇప్పుడైతే, చైనా వైద్యులు చేపట్టిన తాజా ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది!