
Starlink Satellite Internet : త్వరలో భారత్ కి ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు.. నెలకు ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఒక శుభవార్త అందుబాటులోకి రానుంది.
భారత మార్కెట్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఇటీవలే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) శాటిలైట్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్ ధరలపై కీలక సిఫార్సులను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్టార్‌లింక్, భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది.
వివరాలు
రూ. 840 కంటే తక్కువకు అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్
ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం, స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో ప్రారంభ ఆఫర్‌గా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రమోషనల్ రేటుతో అందించనుంది.
ఈ ప్లాన్‌కు నెలవారీ ఛార్జీ $10 (అంటే సుమారు రూ. 840) కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా సౌకర్యం కలిగే అవకాశముంది.
అయితే, సర్వీస్ ప్రారంభించేందుకు వినియోగదారులు వన్ టైమ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
హ్యాండ్లింగ్, షిప్పింగ్ కోసం సుమారు 2,800 BDT (భారత కరెన్సీలో సుమారు రూ. 2,000) అదనంగా ఖర్చవుతుంది.
మొత్తంగా, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవను ఉపయోగించాలంటే దాదాపు రూ. 37,200 ఖర్చు అవుతుందని అంచనా.
వివరాలు
రూ. 840 కంటే తక్కువకు అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్
ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం, స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో ప్రారంభ ఆఫర్‌గా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రమోషనల్ రేటుతో అందించనుంది.
ఈ ప్లాన్‌కు నెలవారీ ఛార్జీ $10 (అంటే సుమారు రూ. 840) కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా సౌకర్యం కలిగే అవకాశముంది. అయితే, సర్వీస్ ప్రారంభించేందుకు వినియోగదారులు వన్ టైమ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
హ్యాండ్లింగ్ మరియు షిప్పింగ్ కోసం సుమారు 2,800 BDT (భారత కరెన్సీలో సుమారు రూ. 2,000) అదనంగా ఖర్చవుతుంది.
మొత్తంగా, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవను ఉపయోగించాలంటే దాదాపు రూ. 37,200 ఖర్చు అవుతుందని అంచనా.
వివరాలు
కోటికి పైగా వినియోగదారులే లక్ష్యం
దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్‌ను ప్రవేశపెట్టే ముఖ్య ఉద్దేశం,త్వరితగతిన ఇంటర్నెట్ యాక్సెస్‌ను విస్తరించడం.
దీని ద్వారా కంపెనీ రాబోయే సంవత్సరాల్లో కోటికి పైగా వినియోగదారులకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వానికి 4 శాతం వాటా విధానం
ట్రాయ్ విధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, స్టార్‌లింక్‌తో పాటు అన్ని ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు తమ వార్షిక ఆదాయంలో 4శాతం భాగాన్ని ప్రభుత్వానికి అందించాలి.
పట్టణ ప్రాంతాల్లో సేవలు అందిస్తే, ప్రతి కస్టమర్ నుంచి ప్రతి ఏడాది రూ. 500 అదనపు ఛార్జీ వసూలు చేయాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అదనపు ఛార్జీలు మినహాయింపు పొందుతాయి.
ట్రాయ్ ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విస్తరణను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సిఫార్సులను రూపొందించినట్టు తెలుస్తోంది.
వివరాలు
బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారతంలో తక్కువ ఖర్చు
స్పెక్ట్రమ్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులు అధికంగా ఉన్నా కూడా, కొన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు తక్కువ ధరలకు సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇక బంగ్లాదేశ్‌లో స్టార్‌లింక్ సేవలు భారత్‌తో పోలిస్తే కాస్త ఖరీదైనవిగా ఉన్నాయి.
అక్కడ నెలవారీ ప్లాన్ ధర సుమారు 6,000 BDT, అంటే రూ. 4,200 గా ఉంది.
అంతేకాకుండా, ఈ సేవలను ఉపయోగించేందుకు వినియోగదారులు ప్రత్యేకమైన డివైజ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వాటి ధర సుమారుగా 47,000 BDT (భారత కరెన్సీలో సుమారు రూ. 33,000)గా ఉంది.