Page Loader
WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం!
వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం!

WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ యూజర్ల కోసం తాజాగా మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చేందుకు మెటా సిద్ధమైంది. ఇప్పటికే పాటలు జోడించడం, మెన్షన్ చేసే సదుపాయం వంటి ఫీచర్లతో స్టేటస్‌ విభాగాన్ని నూతనంగా తీర్చిదిద్దిన ఈ మెసేజింగ్‌ యాప్‌, త్వరలో మరో నాలుగు స్టేటస్ ఫీచర్లను విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని మెటా తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటించింది. నచ్చిన లేఅవుట్‌తో కొల్లేజ్ వాట్సప్‌లో కొత్తగా అందుబాటులోకి రానున్న ఫీచర్‌తో, యూజర్లు గరిష్ఠంగా ఆరు ఫొటోలను ఎంచుకొని, వాటిని వివిధ లేఅవుట్‌లలో కొల్లేజ్‌గా రూపొందించుకోవచ్చు. ఎడిటింగ్‌ టూల్స్ సాయంతో స్టేటస్‌లను మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీల తరహాలో, ఇప్పుడు వాట్సప్‌ స్టేటస్‌ ఫీచర్‌ ద్వారా పాటను నేరుగా పోస్ట్‌ చేయగల అవకాశాన్ని అందిస్తోంది.

Details

ఫోటోలను స్టిక్కర్లుగా మార్చుకోనే అవకాశం

'మోర్ విత్ మ్యూజిక్' పేరుతో వచ్చే ఈ ఫీచర్‌ ద్వారా, మీరు ఒక పాటను స్టేటస్‌గా సెట్‌ చేసి, మీ మనసులోని భావాలను సంగీతంతో వ్యక్తపరచవచ్చు. ఫొటోలను స్టిక్కర్లుగా మార్చుకునే అవకాశం ఇప్పటివరకు కేవలం రెడీమేడ్‌ స్టిక్కర్లతోనే పరిమితమైన స్టేటస్‌కు, ఇప్పుడు కొత్తదనాన్ని జోడించేందుకు మెటా ప్రయత్నిస్తోంది. కొత్తగా రానున్న ఫీచర్‌ ద్వారా, మీ ఫొటోలను స్టిక్కర్‌గా మార్చుకొని స్టేటస్‌లో పోస్ట్‌ చేయవచ్చు. మీకు నచ్చిన విధంగా స్టైలింగ్‌ చేస్తూ ప్రత్యేకతను చాటవచ్చు.

Details

త్వరలోనే 'యాడ్ యువర్స్' టూల్

ఇంటరాక్టివ్‌ టూల్‌ 'యాడ్ యువర్స్' ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఇప్పటికే విజయవంతమైన 'యాడ్ యువర్స్' టూల్‌ త్వరలో వాట్సప్‌లోకి వస్తోంది. దీనివల్ల యూజర్లు తమ ఫ్రెండ్స్‌ను స్టేటస్‌ ఇంటరాక్షన్‌లో చేర్చొచ్చు. ఉదాహరణకు చిన్ననాటి ఫొటోను స్టేటస్‌గా పెట్టి, దానిపై 'యాడ్ యువర్స్' స్టిక్కర్‌ను జోడిస్తే, మీ ఫ్రెండ్స్ కూడా తమ ఫొటోలను అదే థీమ్‌లో పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్లతో వాట్సప్‌ స్టేటస్‌ మరింత ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్‌గా మారనుంది.