
డీప్ ఫేక్‌లో మిలియన్ డాలర్ల స్కాంను అడ్డుకున్న ఫెరారీ ఎగ్జిక్యూటివ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం యుగంలో టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ప్రస్తుతం డీప్‌ఫేక్ వాయిస్‌లు, డీప్‌ఫేక్ ఫోటోలు, డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఫెరారీలోని ఒక ఎగ్జిక్యూటివ్ మిలియన్ డాలర్ల స్కాంను ఆపారు.
సీఈఓ బెనెడెట్టో విగ్నా పేరుతో ఒకరు కొనుగోలుపై ఎగ్జిక్యూటివ్ తో చర్చించారు. అయితే మెసేజ్‌లు, ప్రొఫెల్ పిక్చర్ కాస్త భిన్నంగా ఉండటంతో ఎగ్జిక్యూటవ్‌కి అనుమానం వచ్చింది.
తర్వాత స్కామర్ డీప్‌ఫేక్ కాల్‌కు ప్రయత్నించాడు. ఎగ్జిక్యూటివ్‌కి అనుమానం వచ్చి, విఘ్న సిఫార్సు చేసిన పుస్తకం పేరు అడిగాడు.
Details
విచారణకు సిద్ధమైన ఫెరారీ
దీంతో అతను సమధానం చెప్పలేక తప్పించుకున్నాడు.
డీప్ ఫేక్ ద్వారా ఇటాలియన్ యాసలో మాట్లాడటంతో ఎగ్జిక్యూటివ్ కు అనుమానాలను మరింత పెంచింది.
ఈ ఘటనపై విచారణను ప్రారంభించేందుకు ఫెరారీ సంస్థ సిద్ధమైంది.
నేరస్థులు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి, ఉన్నత స్థాయి వ్యక్తుల వలె నటిస్తున్నారు. తాజాగా కార్పొరేట్ నేరాల్లో ఇది మరింత పెరుగుతోంది.