NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Sunita Williams: చిక్కుల్లో మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ , అంతుచిక్కని వైరస్ కారణమా?
    తదుపరి వార్తా కథనం
    Sunita Williams: చిక్కుల్లో మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ , అంతుచిక్కని వైరస్ కారణమా?
    చిక్కుల్లో మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ , అంతుచిక్కని వైరస్ కారణమా?

    Sunita Williams: చిక్కుల్లో మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ , అంతుచిక్కని వైరస్ కారణమా?

    వ్రాసిన వారు Stalin
    Jun 11, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుల్లోపడ్డారు. అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్‌గా పిలిచే ఎంటర్ బాక్టర్ బుగాన్ డెన్సిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

    మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తిమంతమైనదని వివరించారు.

    ఈ బ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని 'సూపర్ బగ్' అని పిలుస్తుంటారని, శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

    కాగా ఈ సూపర్ బగ్‌తో ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పాటు మరో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుల్లో పడ్డారు.

    వివరాలు 

    మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది 

    సునీతా విలియమ్స్ పాటు బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6, 2024న అంతర్జాతీయ అంతరక్ష కేంద్రానికి చేరుకున్నారు.

    మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఈ 'స్పేస్ బగ్స్' గ్రహాంతరాలకు సంబంధించినవి కావని, వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు బలంగా భావిస్తున్నారు.

    మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, ఇది బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తిమంతమైనదని వివరించారు.

    ఈ బ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని 'సూపర్ బగ్' అని పిలుస్తుంటారని, శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

    వివరాలు 

    మానవ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది 

    ISS వద్ద కనుగొన్న ఈ బహుళ-ఔషధ నిరోధక బ్యాక్టీరియాను 'ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్' అని పిలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

    ఇది సంవృత వాతావరణం (క్లోజ్‌డ్ సిస్టమ్)లో అభివృద్ధి చెందింది మరింత శక్తివంతమైనది. సాధారణంగా 'సూపర్‌బగ్' అని పిలుస్తారు.

    ఇది మానవ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే బహుళ-ఔషధ నిరోధక బ్యాక్టీరియా.

    వివరాలు 

    భారతీయుడి సారధ్యంలో పరిశోధనలు 

    కాగా అంతరిక్ష కేంద్రంలో పనిచేసే వ్యోమగాములు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తుంటారు.

    అంతరిక్ష యాత్రల సమయంలో విభిన్నమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటుంటారని పరిశోధకులు చెబుతున్నారు.

    సంప్రదాయ వైద్య సదుపాయాలకు దూరంగా ఉంటారు కాబట్టి వ్యోమగాముల ఆరోగ్యంపై సూక్ష్మజీవుల ప్రభావాన్ని అంచనా వేసే పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    ఈ పరిశోధనలకు కాలిఫోర్నియాలోని పసాదేనా కేంద్రంగా పనిచేస్తున్న నాసా 'జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ'కి చెందిన డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారధ్యంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి.

    వెంకటేశ్వరన్ నాసాలో చేరడానికి ముందు చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో మెరైన్ మైక్రోబయాలజీ చదివారు.

    2023లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా'కలామిల్లా పియర్సోని' అనే కొత్త మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ బగ్‌ని ఆయన కనుగొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాసా

    తాజా

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం

    నాసా

    అంగాకరుడిపై రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న నాసా రోవర్ మిషన్ గ్రహం
    నాసా, స్పేస్‌ ఎక్స్ సిబ్బంది మిషన్ ప్రయోగం ఫిబ్రవరి 27కి వాయిదా అంతరిక్షం
    నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న క్రూ-6 మిషన్ గురించి వాస్తవాలు అంతరిక్షం
    నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్ ప్రయోగం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025