Page Loader
Ashwini Vaishnaw on AI: దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ.. అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి
దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ.. అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

Ashwini Vaishnaw on AI: దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ.. అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అమెరికా, చైనాల మధ్య పోటీ కొనసాగుతున్న వేళ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. రాబోయే నెలల్లో భారత్‌ స్వంత జనరేటివ్‌ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉత్కర్ష్ ఒడిశా కాన్‌క్లేవ్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. భారతదేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ మోడల్‌ను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.

వివరాలు 

 8-10 నెలల్లో సొంత ఏఐ మోడల్‌

ఈ మోడల్‌ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యంతో అభివృద్ధి చేయబడుతుందని మంత్రి తెలిపారు. దేశంలోని భాషా,సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిగణలోకి తీసుకొని, తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించనున్నారు. దేశీయ అవసరాల కోసం అభివృద్ధి చేయబోయే ఈ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌కు సుమారు 19,000 జీపీయూలు అవసరమని, అందులో 15,000 హైఎండ్ జీపీయూలు ఉండనున్నాయని ఆయన వివరించారు. ఇప్పటివరకు ఆరుగురు డెవలపర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాబోయే 8-10 నెలల్లో ఈ ఏఐ మోడల్‌ సిద్ధమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఇదే జరిగితే, అమెరికా, చైనాల సరసన భారత్‌ కూడా ఏఐ రంగంలో దూసుకుపోతుందని అన్నారు.