Page Loader
OpenAI: సోరా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చేందుకు భారతీయ కళాకారుల సాయం అవసరం : ఓపెన్‌ఏఐ
సోరా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చేందుకు భారతీయ కళాకారుల సాయం అవసరం : ఓపెన్‌ఏఐ

OpenAI: సోరా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చేందుకు భారతీయ కళాకారుల సాయం అవసరం : ఓపెన్‌ఏఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 11, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా సృష్టించిన 'సోరా' సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపర్చేందుకు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కళాకారులు, సృజనాత్మకులు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది. ఈ సాఫ్ట్‌వేర్, టెక్స్ట్ ఆధారంగా వీడియోలు రూపొందించగల సామర్థ్యంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీన్ని భారతీయ సృజనాత్మకుల సహా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారని ఓపెన్‌ ఏఐ సంస్థ ధ్రువీకరించింది. సోరా గురించి ఈ ఏడాది ప్రారంభంలో చేసిన పరిశోధనను ప్రపంచవ్యాప్తంగా పంచుకున్న తర్వాత, కళాకారులు, సృజనాత్మక వ్యక్తుల నుండి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడాన్ని ప్రారంభించామని ఓపెన్‌ ఏఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.

Details

వేగవంతమైన వెర్షన్ తయారు చేయడానికి కృషి

వారిలో భారతీయులూ కూడా ఉన్నారని, త్వరలోనే సరికొత్త, వేగవంతమైన వెర్షన్‌ను తయారు చేస్తామన్నారు. భారతదేశంలోని కళాకారులు, సినీదర్శకులు, సృజనాత్మక వ్యక్తులు ఈ టూల్‌ను ఉపయోగించి కొత్త కంటెంట్ ఎలా సృష్టిస్తారో చూడాలని ఆసక్తిగా ఉన్నామని తెలిపింది. ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్న సోరా సాఫ్ట్‌వేర్, 20 సెకన్ల నిడివి గల 1080 పిక్సల్ వీడియోలను సృష్టించగలదు. చాట్‌జీపీటీ ప్లస్‌ ఖాతాదారులకు అదనంగా దీనిని ఆఫర్‌ చేస్తోంది. ఒక వినియోగదారు ప్రతినెలా 480 పిక్సల్ వీడియోలు 50 వరకు, 720 పిక్సల్ వీడియోలు కాస్త తక్కువగా తయారు చేసుకోవచ్చు.

Details

 డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందించకుండా జాగ్రత్తలు

అదే సమయంలో, అసాంఘిక, హానికరమైన కంటెంట్‌ సృష్టించడం, డీప్‌ఫేక్‌ వీడియోలను రూపొందించకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఓపెన్‌ ఏఐ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి, రెడ్‌టీమర్లు, సైబర్‌సెక్యూరిటీ నిపుణులు, కొన్ని కంటెంట్‌ క్రియేటర్లు మాత్రమే ఈ టూల్‌ ఉపయోగించేందుకు అనుమతిస్తున్నామని పేర్కొంది. ఈ తాజా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి క్రమంలో, వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ద్వారా మరింత సమర్థవంతమైన, వేగవంతమైన టూల్‌ తయారు చేయాలని ఓపెన్‌ ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.