Venus: శుక్రుడిపై జీవం ఉందా.. పరిశోధకులు ఎం చెప్పారంటే
మానవాళీ మనుగడుకు విశ్వంలో భూమి మాత్రమే జీవజలానికి ఇళ్లుగా ఉంది. మరోపక్క శాస్త్రవేత్తలు అనంత విశ్వంలో జీవానికి అనుకూలంగా ఉన్న భూమి లాంటి మరో గ్రహం కోసం వెతుకుతూనే ఉన్నారు. తాజాగా జీవంతో సంబంధం ఉన్న ఫాస్ఫైన్ అనే వాయువు ఉనికిని సమర్థించే కొత్త సాక్ష్యాన్ని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. వారి ఆవిష్కరణ సందేహాస్పదంగా ఉన్న ఈ ప్రకటన నాలుగు సంవత్సరాల తర్వాత రావడం గమనార్హం. శుక్రుడి మీద జీవం ఉండే అవకాశాన్ని సూచించే విధంగా ఫాస్పైన్ వాయివు ఆనవాళ్లను కనుగొన్నారు. ఇదే శాస్త్రవేత్తల నమ్మకాన్ని బలం చేకూర్చింది.
ఫాస్ఫైన్‌ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఈ నెల ప్రారంభంలో కార్డిఫ్ యూనివర్సిటీలో రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సమావేశంలో తాజా డేటాను సమర్పించారు. శుక్రుడి వాతావరణంలో ఫాస్ఫైన్‌ని కొనుగొన్నట్లు తెలిపారు. గీవ్స్ బృందం వీనస్ మేఘాలను పరిశీలించడానికి జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ టెలిస్కోప్ ను ఉపయోగించింది. ఫాస్ఫైన్‌తో పాటు, అమ్మోనియా అనే మరో గ్యాస్‌కు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. ఈ ఆవిష్కరణ ఫాస్ఫైన్ కంటే చాలా ముఖ్యమైందన్నారు. రెండు వాయువులు భూమిపై క్షీణిస్తున్న సేంద్రీయ పదార్థం లేదా బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతాయి.
అంతుపట్టిన శుక్రుడి సౌర వ్యవస్థ
ఫాస్ఫైన్ వాస్తవానికి సాధారణ సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చునని మునుపటి పరిశోధకులు పేర్కన్నారు. కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ, పోమోనా నుండి ప్రొఫెసర్ రాకేష్ మొగల్ నేతృత్వంలో కూడా ఓ అధ్యయనం చేశారు. అతని పరిశోధన NASA పయనీర్ వీనస్ లార్జ్ ప్రోబ్ నుండి పాత డేటాను తిరిగి విశ్లేషించింది. వీనస్ మేఘాలలో భాగానికి-మిలియన్ స్థాయిలో ఫాస్ఫైన్ సాక్ష్యాలను బయటికి తీసింది. శుక్రుడి సౌర వ్యవస్థ అంతుపట్టకుండా ఉండటంతో దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.