Page Loader
Chairman of ISRO: ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆత్మకథను రాసిన ఇస్రో ఛైర్మన్
ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆత్మకథను రాసిన ఇస్రో ఛైర్మన్

Chairman of ISRO: ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆత్మకథను రాసిన ఇస్రో ఛైర్మన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాలయాళంలో 'నిలవు కుడిచ సింహంగళ్' అనే పేరుతో ఆత్మకథను రాశారు. నవంబర్‌లో ఈ పుస్తకాన్ని మార్కెట్లో విడుదల చేయనున్నారు. అతని బాల్యం ప్రారంభం నుండి చంద్రయాన్-3 నాయకత్వం వహించిన వరకూ తన ఎదుర్కొన్న సవాళ్లను ఆ పుస్తకంలో వెల్లడించనున్నారు. తన ఆత్మకథ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. 59 ఏళ్ల ఇస్రో ఛైర్మన్ కళాశాల సమయంలో ఆర్థిక కష్టాలను అధిగమించడం, ఖర్చులను తగ్గించుకోవడానికి వసతి గృహాలలో జీవించడం, రవాణా కోసం పాత సైకిల్‌ను తొక్కడం వంటి అనుభవాలను అందులో వివరించాడు.

Details

మలయాళంలో ఆత్మకథను రాసిన ఎస్ సోమనాథ్

మనకు కొంచెం అదృష్టం ఉండి, వచ్చిన అవకాశాలను ఉపయోగించడానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలని సోమనాథ్ అన్నారు. మన జీవితంలోకి వచ్చే చాలా మంది పాత్రలను మనం గ్రహిస్తే, అది కెరీర్ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ కె రాధాకృష్ణన్‌తో సహా తన వృత్తికి దోహదపడిన ప్రభావవంతమైన వ్యక్తుల గురించి సోమనాథ్ వివరించారు. సోమనాథ్ తన ఆత్మకథను తన మాతృభాష అయిన మలయాళంలో రాశాడు. కేరళకు చెందిన లిపి పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. రాకెట్ ఉత్పత్తి, PSLV, GSLV మార్క్ 3, చంద్రయాన్-3 మిషన్ వంటి ఇతర వివరాలతో పాటు ఇస్రోతో తనకున్న అనుబంధాలను ఇందులో వెల్లడించనున్నారు.