
Japan: 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో జపాన్ ఇంటర్నెట్ సంచలనం.. భారత్ కంటే 16 మిలియన్ రెట్లు స్పీడ్
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక సదుపాయాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న జపాన్.. మరో సాంకేతిక అద్భుతాన్ని సొంతం చేసుకుంది. మానవ శక్తికి అందని వేగంతో పని చేసే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు. నిమిషం కాదు, క్షణం కాదు.. కేవలం ఒక్క సెకనులోనే 1.02 పెటాబిట్స్ స్పీడ్‌ను అందించే ఈ ఇంటర్నెట్‌తో నెట్‌ఫ్లిక్స్ మొత్తం లైబ్రరీనే రెప్పపాటు సమయంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు! ఈ అద్భుత ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసినది జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(NICT). అమెరికాలో ప్రస్తుతంగా ఉన్న సగటు ఇంటర్నెట్ స్పీడ్ కంటే ఇది 35 లక్షల రెట్లు వేగంగా ఉంటే, భారత్‌లోని సగటు స్పీడ్‌తో పోల్చితే 160 లక్షల రెట్లు అధికమని నిఐసీటి పేర్కొంది.
Details
రికార్డు స్థాయిలో స్పీడ్
ఈ రికార్డు స్థాయి స్పీడ్‌కు కారణం.. అత్యాధునిక ఫోటోనిక్ నెట్‌వర్క్ టెక్నాలజీ. ఈ ప్రయోగంలో జపాన్ పరిశోధకులతో పాటు సుమితోమో ఎలక్ట్రిక్ సంస్థతోపాటు యూరోపియన్ టెక్ పార్ట్‌నర్స్ కలిసి పని చేశారు. ఇందులో 19 లూపింగ్ సర్క్యూట్లు కీలక పాత్ర పోషించాయి. ఒక్కో లూప్ సుమారు 86.1 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండగా, ఈ వ్యవస్థ ద్వారా 1808 కిలోమీటర్ల దూరానికి డేటా ప్రసారించవచ్చు. ఇంత స్పీడ్‌తో ఏం సాధ్యమవుతుందంటే, ఇంగ్లీష్ వికీపిడియా మొత్తం (దాదాపు 100GB)ను ఒక్క సెకనులో 10,000 సార్లు డౌన్‌లోడ్ చేయవచ్చని పరిశోధకులు వివరించారు. అదేవిధంగా 8కే వీడియోలు కూడా ఒక్క క్షణంలో డౌన్‌లోడ్ కావడం సాధ్యమవుతుంది.
Details
టెక్ రంగాన్ని కొత్తదిశగా తీసుకెళ్లే ప్రయత్నం
ఇప్పటికి ఇది గృహ వినియోగదారులకు అందుబాటులోకి రానప్పటికీ, ప్రభుత్వాలు, డేటా సెంటర్‌లు, టెలికాం సంస్థలు దీన్ని తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా 6G టెక్నాలజీ, సముద్రగర్భ కేబుల్స్ వంటి విభాగాల్లో ఈ నూతన ఇంటర్నెట్ మోడల్ కీలక మార్గదర్శకంగా నిలవనుంది. ఒకనాటి బుల్లెట్ రైళ్లు ఎలా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచాయో.. ఇప్పుడు అదే స్థాయిలో ఈ పెటాబిట్ స్పీడ్ ఇంటర్నెట్ కూడా ప్రపంచ టెక్ రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లనుంది.