
Whatsapp: వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్'లకు కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ యాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఫార్వార్డెడ్ మెసేజ్‌లు లేదా చిత్రాలు రావడం సాధారణం. ఇవి నిజమా కాదా? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఇప్పటివరకు యూజర్లు వాట్సప్ నుంచి బయటకు వెళ్లి వెబ్‌లో శోధించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడం కోసం వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి నుంచి, ఏదైనా మెసేజ్ లేదా ఫోటోను చాలాసార్లు ఫార్వార్డ్ చేసినప్పుడు, దానిపైనే "Search the Web" అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై ట్యాప్ చేస్తే "Search", "Cancel" అనే రెండు ఎంపికలు వస్తాయి.
వివరాలు
సమాచారం నిజమా కాదా అనేది సులభంగా నిర్ధారించవచ్చు
యూజర్ "Search" పై క్లిక్ చేస్తే,తక్షణమే బ్రౌజర్ ఓపెన్ అయి ఆ మెసేజ్ లేదా ఫోటో గూగుల్‌లో సెర్చ్ చేసి సంబంధిత సమాచారం చూపుతుంది. ఈ విధంగా ఆ సమాచారం నిజమా కాదా అనేది సులభంగా నిర్ధారించుకోవచ్చు. అయితే,ఈ ఫీచర్ ఉపయోగించే సమయంలో గూగుల్ సేవలు,గోప్యతా నిబంధనలు వర్తిస్తాయి. ఈ సదుపాయం 2020లో బీటా వెర్షన్‌గా బ్రెజిల్, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాల్లో తొలుత ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ ఫీచర్ చిలీ, అర్జెంటీనా, కొలంబియా, ఫ్రాన్స్, జర్మనీ, నైజీరియా, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, వెనిజువెలా వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఇది ఎక్కువసార్లు ఫార్వార్డ్ చేయబడిన మెసేజ్‌లు, చిత్రాలపైనే పనిచేస్తుంది.