Elon Musk: ఇది భారీ సైబర్ దాడి.. ఎక్స్ సేవల్లో అంతరాయంపై ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) సోమవారం పని చేయడం నిలిచిపోయింది.
ఒక్క రోజులోనే మూడు సార్లు సేవలకు అంతరాయం కలిగింది. దీనిపై 'ఎక్స్' యజమాని, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ఇది భారీ సైబర్ దాడి కారణంగా జరిగిందని తెలిపారు.
ఈ మేరకు ఆయన ఒక పోస్టు చేశారు. ''ప్రతిరోజూ మేము సైబర్ దాడులకు గురవుతున్నాము. అయితే, ఈ దాడి వెనుక భారీ వనరులు ఉన్న ఒక పెద్ద గ్రూప్ లేదా ఒక దేశం ఉండొచ్చు'' అని వెల్లడించారు.
ఇదెట్లా జరిగిందో ట్రేస్ చేస్తున్నట్లు కూడా వివరించారు.
వివరాలు
ఫిర్యాదులు నమోదు చేసిన 40,000 మంది యూజర్లు
సైబర్ దాడులపై నిఘా వేసే 'డౌన్‌డిటెక్టర్' వెబ్‌సైట్ ప్రకారం, ఎక్స్ సేవలు ఒక్క రోజులో మూడు సార్లు నిలిచిపోయాయి.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనేక మంది యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నారు.
అనంతరం రాత్రి 7.30 గంటలకు మళ్లీ సేవలు నిలిచిపోయాయి. రాత్రి 9 గంటలకు మరోసారి అంతరాయం ఏర్పడింది, దీని వల్ల చాలా మంది ఎక్స్‌ను యాక్సెస్ చేయలేకపోయారు.
ఈ సమస్య 56% యాప్ యూజర్లకు, 33% వెబ్‌సైట్ వాడుతున్నవారికి ప్రభావం చూపింది.
ముఖ్యంగా అమెరికా, భారత్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ అంతరాయం తీవ్రంగా కనిపించింది. దాదాపు 40,000 మంది యూజర్లు తమ ఫిర్యాదులు నమోదు చేశారు.