Page Loader
కనువిందు చేసిన సూపర్‌మూన్‌.. భూమికి చేరువగా, ప్రకాశవంతంగా చందమామ
భూమికి చేరువగా,ప్రకాశవంతంగా చందమామ

కనువిందు చేసిన సూపర్‌మూన్‌.. భూమికి చేరువగా, ప్రకాశవంతంగా చందమామ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశంలో మరోసారి అద్భుతం చోటు చేసుకుంది. చంద్రుడు మరోసారి భూమికి దగ్గరగా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్‌మూన్‌ ఏర్పడింది. సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించాడు. సోమవారం సూపర్‌మూన్‌ సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకు భారతదేశంలోని దిల్లీలో కనువిందు చేశాడు. ఆకాశంలోని మిగతా నక్షత్రాల కంటే ఇవాళ చంద్రుడు కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించాడు. ఈ సంవతర్సంలో ఇదే మొదటి సూపర్ మూన్. ఏడాదిలో మొత్తం 12 సార్లు సూపర్‌మూన్‌లు ఉంటాయి. 2023లో మాత్రం 13 సూపర్‌మూన్‌లు రానుండటం విశేషం. ఆగస్టులో రెండు సార్లు పూర్ణ చంద్రుడిని వీక్షించే అవకాశం ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

DETAILS

ప్రత్యేక పరిస్థితుల్లో భూమీకి దగ్గరగా చంద్రుడు

చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో దగ్గరగా వస్తే పెరీజీ అంటారు.అదే దూరంగా ఉంటే అపోజీ అని అంటారు. సూపర్‌మూన్‌ను బక్‌ మూన్‌ అని కూడా అంటుంటారు. చందమామ సాధారణ స్థాయి కంటే కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తే దీన్నే సూపర్‌మూన్‌ అని పిలుస్తారు. 90 శాతం చంద్రుడు తన కక్ష్యలోనే భూమికి దగ్గరగా వచ్చే సమయాల్లో సూపర్‌మూన్‌లు ఏర్పడతాయి. సాధారణంగా చంద్రుడు భూమికి 3,84,400 కిమీ దూరంలో ఉంటాడు. ప్రత్యేక పరిస్థితుల్లో 3,61,934 కి.మీకు తగ్గి భూమికి దగ్గరగా రానున్నాడు. సూపర్‌మూన్‌ 7 శాతం పెద్దదిగా , 15 శాతం ప్రకాశవంతంగా ఉంటాడు. అపోజీ కంటే పెరీజీలోనే 14 శాతం పెద్దగా, 30శాతం ప్రకాశవంతగా కనువిందు చేస్తాడు.