Moon: చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టి 55 ఏళ్లు పూర్తి
చంద్రునిపై మానవుడు కాలుమోపి నేటితో.. 55 ఏళ్లు పూర్తవుతున్నాయి. నాసా 1968 లో 'అపోలో-11'లో వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను చంద్రుడి పైకి పంపింది. అపోలో 11 జూలై 16, 1969న చంద్రునిపైకి ప్రయోగించారు. అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్ అదే సంవత్సరం జూలై 20న చంద్రునిపై దిగింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డు సృష్టించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత.. అల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. చంద్రుడిపై మొదటిసారిగా కాలుమోపిన అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పట్లో చేసిన కామెంట్స్‌ను ఇప్పటికీ సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు.
జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
'ఇక్కడ పడింది చిన్న అడుగే కావొచ్చు. కానీ మానవాళికి ఇది అతిపెద్ద ముందడుగు' అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. జాబిల్లిపై మానవుడు కాలుమోపిన రోజుకి గుర్తుగా ప్రతి ఏడాది జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగు పెట్టగా ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు ఆ తర్వాత చంద్రుడిపై అడుగు పెట్టాడు. ఆటు తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు చంద్రుడిపైకి వెళ్లి వచ్చారు. ఇక 1972 తర్వాత మనుషులను పంపే మిషన్‌ను అమెరికా ఇంకోసారి చేపట్టలేదు. అప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క దేశం మనుషులను పంపలేదు.
నాసా తదుపరి చంద్రుని మిషన్‌కు సిద్ధమవుతోంది
ఇప్పుడు జాబిల్లిపైకి మనుషులను పంపాలని చైనా ప్రయత్నం చేస్తోంది. అలాగే భారత్ కూడా చంద్రుడి పై మనుషులను పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఏదేమైనా, చారిత్రాత్మక సంఘటనను జరుపుకోవడానికి, NASA ముగ్గురు వ్యోమగాములు చంద్రునిపై వారి తదుపరి పర్యటన కోసం సిద్ధమవుతున్నట్లు చూపించే చిత్రాల శ్రేణిని పంచుకుంది. సాటర్న్ V రాకెట్‌లో వేలాది మంది సిబ్బందితో పాటు నిలబడి ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసింది.