Page Loader
Viral Video: నాసా వ్యోమగాములు అంతరిక్షంలో  బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో      
నాసా వ్యోమగాములు అంతరిక్షంలో బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో

Viral Video: నాసా వ్యోమగాములు అంతరిక్షంలో  బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో      

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమిపై దుస్తులు ధరించడం చాలా సులభం. అయితే, అంతరిక్షంలో దుస్తులు మార్చుకోవడం మాత్రం ఓ సవాలుగా మారుతుంది. నాసాకు చెందిన అనుభవజ్ఞుడైన వ్యోమగామి డాన్ పెటిట్, శూన్యాకాశంలో దుస్తులు ఎలా సులభంగా ధరించాలనే దానిపై ప్రజలకు ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో ఆయన తన ప్యాంటును విభిన్నంగా, ప్రత్యేకమైన శైలిలో ధరించడాన్ని చూడొచ్చు. ఈ వీడియోను ఫిబ్రవరి 21న షేర్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన వినూత్న డ్రెస్సింగ్ టెక్నిక్‌ను ప్రదర్శించిన ఆయన, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్

సాధారణంగా, భూమిపై మనం ఒక్కో కాలు పెట్టుకుంటూ ప్యాంటు తొడుగుతాం. కానీ డాన్ పెటిట్ మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని పాటించారు. తన ప్యాంటును గాల్లో తేలిపోయేలా ఉంచి, తన శరీరాన్ని నెమ్మదిగా కిందికి జార్చుకుంటూ, ఒకేసారి రెండు కాళ్ళను దానిలోకి ప్రవేశింపజేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూనే, ఆయన ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వీడియోను వీక్షించిన నెటిజన్లు తన తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. "ఇది అద్భుతంగా ఉంది!" అని ఒకరు స్పందించగా, "నేను కూడా భూమిపై ఇలా చేయడానికి ప్రయత్నించాను, కానీ విఫలమయ్యాను" అని మరొకరు హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు.

వివరాలు 

డాన్ పెటిట్ వినూత్న విన్యాసాలు 

అయితే, డాన్ పెటిట్ అనుభవజ్ఞుడైన వ్యోమగామి. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. 1955లో ఒరెగాన్‌లోని సిల్వర్టన్‌లో జన్మించిన ఆయన, కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. నాసాతో ఆయనకు చాలా కాలంగా అనుబంధం ఉంది. అనేక అంతరిక్ష మిషన్లలో పాల్గొని, 370 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇలాంటి వినూత్న విన్యాసాలు చేయడం ఆయనకు ఎంతో సులభం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డాన్ పెటిట్ చేసిన ట్వీట్