Page Loader
Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. మార్చి వరకు ISSలో.. 
సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. మార్చి వరకు ISSలో..

Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. మార్చి వరకు ISSలో.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, సాంకేతిక కారణాల వల్ల కొంత కాలం అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ కారణంగా ఆమె భూమికి తిరిగి రావడానికి మరింత ఆలస్యంగా జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారని నాసా తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 6న సునీతా, బుచ్ విల్మోర్, బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో తమ 8 రోజుల మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో, వారు అక్కడే చిక్కుకున్నారు.

వివరాలు 

నలుగురు వ్యోమగాములు ఫిబ్రవరిలో భూమికి..

ఈ క్రమంలో, స్పేస్-X క్రూ-9 మిషన్ ప్రారంభించారు. ఇందులో ఇద్దరు వ్యోమగాములు హాగ్, గోర్బునోవ్‌ ఉన్నారు. వారు, అంతరిక్షంలో చిక్కుకున్నవారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు రెండు సీట్లను ఖాళీగా పంపించారు. ఈ మిషన్ సెప్టెంబరులో అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అంతేకాకుండా, నాసా తొలుత ప్రకటించినట్లుగా నలుగురు వ్యోమగాములు ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని భావించారు. కానీ, క్రూ-9 సిబ్బందిని రిలీవ్‌ చేసేందుకు క్రూ-10 మిషన్ మార్చి నెల కంటే ముందుగా జరగనుందని స్పష్టమైంది. అందువల్ల, సునీతా, బుచ్ విల్మోర్‌ భూమికి తిరిగి రావడం ఇంకా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

వివరాలు 

డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌

ఇటీవల నాసా తెలిపినట్లుగా, ఇది సునీతా విలియమ్స్‌కు మూడవ రోదసి యాత్ర. 2006, 2012లో ఆమె ఇప్పటికే ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేశారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈసమయంలో, ఆమె ఐఎస్‌ఎస్‌లో ఓ మారథాన్ కూడా నిర్వహించారు. ఈ సారి ఆమె అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టగానే, ఆనందంతో డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది.