NASA-SpaceX: సునీతా విలిమయ్స్‌కు మరోసారి నిరాశ.. ఫాల్కర్ 9 రాకెట్‌లో సమస్యతో ప్రయోగం వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను భూమికి తీసుకురావడానికి చేపట్టిన ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాల్సిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.
మరో గంటలోపు లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి రాకెట్ ప్రయాణించనుండగా, హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యను గుర్తించారు.
దీంతో బుధవారం జరగాల్సిన ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది.
ఈ సమస్యను స్పేస్‌ఎక్స్ పరిష్కరిస్తే గురువారం లేదా శుక్రవారం మరోసారి ప్రయోగించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాసా చేసిన ట్వీట్
Our #Crew10 explorers are launching to the @Space_Station this evening. Come watch with us!
— NASA (@NASA) March 12, 2025
Crew-10 is scheduled to lift off atop a @SpaceX Falcon 9 rocket at 7:48pm ET (2348 UTC). Share your questions with #AskNASA and we'll answer a few on stream! https://t.co/o3onJBNTe9
వివరాలు
రాకెట్ సురక్షితంగా ఉంది: నాసా
"గురువారం,శుక్రవారం ప్రయోగానికి మరో అవకాశం ఉంది.స్పేస్‌ఎక్స్ హైడ్రాలిక్ సమస్యను పరిష్కరిస్తే ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం త్వరలోనే జరుగుతుంది" అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్‌కు నలుగురు వ్యోమగాములను పంపించాల్సి ఉంది.
అనంతరం మార్చి 16న సునీతా విలియమ్స్,బుచ్ విల్‌మోర్‌లను భూమికి తీసుకురావాలని ప్రణాళిక ఉంది.
ఈ మిషన్‌లో నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్,నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA)కి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్‌కు చెందిన కిరిల్ పెస్కోవ్ పాల్గొనాల్సి ఉంది.
అయితే, రాకెట్ హైడ్రాలిక్ క్లాంప్‌లో లోపం తలెత్తడంతో ఈ నలుగురు వ్యోమగాములు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు.
అదృష్టవశాత్తూ, రాకెట్ కూడా సురక్షితంగా ఉందని నాసా తెలిపింది.
వివరాలు
హైడ్రాలిక్ వ్యవస్థ లోపం వల్ల ప్రయోగం వాయిదా
హైడ్రాలిక్ వ్యవస్థ అనేది లాంచ్ ప్యాడ్ నిర్మాణాలు, స్ట్రాంగ్‌బ్యాక్ రిట్రాక్షన్, అనుసంధాన ప్రక్రియలను నిర్వహించేందుకు ప్రెషరైజ్డ్ ఫ్లూయిడ్‌ను ఉపయోగిస్తుంది.
ఈ వ్యవస్థలో లోపం ఏర్పడితే, ఇంధనం లోడ్ చేయడం, నిర్మాణ కదలికలు, కీలకమైన ప్రీ-లాంచ్ ప్రక్రియలు అంతరాయం కలుగుతాయి.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగి రాకపై అనిశ్చితి క్రూ 10 మిషన్ ద్వారా ఐఎస్ఎస్‌కు వెళ్లే నలుగురు వ్యోమగాములు ఆరు నెలల పాటు వివిధ ప్రయోగాలు చేపడతారు.
ఈ మిషన్ ఎంతో కీలకమైనది. తొమ్మిది నెలలుగా ISSలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను భూమికి తిరిగి రప్పించడానికి ఇది ఒక అవకాశం.
వివరాలు
ప్రయోగానికి కొత్త తేదీ
కానీ ఈ ప్రయోగం వాయిదా పడటం వల్ల వారిద్దరూ ఎప్పుడు భూమికి వస్తారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు స్పేస్‌ఎక్స్ లేదా నాసా ఈ ప్రయోగానికి కొత్త తేదీని ప్రకటించలేదు.
ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగించిన 24 గంటల లోపే ఐఎస్ఎస్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు.
ఈ మిషన్ పూర్తయిన తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగి రావడానికి దాదాపు 180-200 రోజులు పడుతుంది.