
Massive Asteroid: కుతుబ్ మినార్ కంటే పెద్దదైన భారీ గ్రహశకలం..భూమికి సమీపంగా వెళ్లనున్న ఆస్టరాయిడ్
ఈ వార్తాకథనం ఏంటి
మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి భూమిని పలకరించి వెళ్లనుంది. 2025 ఎఫ్‌ఏ22 అనే పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ గ్రహశకలం త్వరలో భూమికి దగ్గరగా ప్రయాణిస్తూ మన పుడమిని పలకరించనుంది. ఈ గ్రహశకల పథాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిధిలోని 'నియర్ ఎర్త్ అబ్జెక్ట్ స్టడీస్' కేంద్రం ద్వారా చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే అమెరికాలోని క్రిసెంటీ వ్యాలీలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నుండి కూడా ఖగోళ శాస్త్రవేత్తలు దీని ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు.
వివరాలు
భూమికి ఇంత దగ్గరగా వెళ్తుండటంతో ఖగోళ శాస్త్ర వేత్తలు, అంతరిక్ష ఔత్సాహికుల్లో ఆసక్తి
శాస్త్రవేత్తల ప్రకారం, సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 8:33 గంటలకు ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీప దూరం నుంచి దూసుకుపోనుంది. ఆ సమయంలో దూరం కేవలం 8,41,988 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. భూమికి ఇంత దగ్గరగా ఇది వెళ్తుండటంతో ఖగోళ శాస్త్రవేత్తలు,అంతరిక్ష ఇష్టవంతులు దీనిపై గాఢ ఆసక్తి చూపిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన రాడార్లు, అధునాతన ఆప్టికల్ టెలిస్కోప్ల సహాయంతో దీన్ని పరిశీలించడం జరుగుతోంది. ఈ గ్రహశకలం చుట్టుకొలత 163.88 మీటర్లు కాగా, పొడవు 280 మీటర్లు. దీని పరిమాణం చూసినప్పుడు, ఇది ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ కంటే పెద్దదిగా ఉంది. 1.85 సంవత్సరాల్లో ఒకసారి మన సూర్యుడి చుట్టూ ఒక గుండ్రటి పథం క్రమంలో ఇది ప్రయాణిస్తుంది.
వివరాలు
సెప్టెంబర్ 21వ తేదీన ఇది భూమికి అత్యంత చేరువగా..
భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పటికీ గురుత్వాకర్షణ ప్రభావ పరిధిలోకి ఇది రాలేదు. నాసా పరిశోధకులు ఈ గ్రహశకలాన్ని ఈ ఏడాది ప్రారంభ నాళ్లలో తొలిసారిగా గుర్తించారు. హవాయిలోని పనోరామిక్ సర్వే టెలిస్కోప్, ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ (పాన్-స్టార్2) ఈ గ్రహశకలాన్ని మార్చి 29న కనుగొన్నారు. 2173 సెప్టెంబర్ 21వ తేదీన ఇది భూమికి అత్యంత చేరువగా వచ్చే ప్రమాదముంది.