Page Loader
Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు 
ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు

Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్క‌రికి మ‌యోపియా ల‌క్ష‌ణాలు న‌మోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల్లో దృష్టిలోపం సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు. చిన్నారుల్లో హ్రస్వి దృష్టి, దగ్గర చూపు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన రిపోర్టును బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ పబ్లిష్ చేసింది. ఈ రిపోర్టులో, ఆరు ఖండాలకు చెందిన 50 దేశాల్లోని 50 లక్షల మంది పిల్లలను అధ్యయనం చేసిన తర్వాత, 2050 నాటికి మయోపియా వంటి కంటి సమస్యలు లక్షలాది చిన్నారుల్లో నమోదవుతాయని పేర్కొన్నారు. కరోనా వల్ల లాక్‌డౌన్ సమయంలో పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైమ్‌ని పెంచారు, అలాగే ఆరుబయట గడిపే సమయం తగ్గడంతో కంటి సమస్యలు మరింత పెరిగినట్లు రిపోర్టు వెల్లడించింది.

వివరాలు 

1990 నుంచి 2023 వరకు మూడు రెట్లు పెరిగినట్లు అధ్యయనం

ఆసియాలో దగ్గర చూపు సమస్యలు అధికంగా ఉన్నాయని, జపాన్‌లో చిన్నారుల్లో 85 శాతం, దక్షిణ కొరియాలో 73 శాతం పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తేల్చారు. చైనా, రష్యా దేశాల్లో ఈ సమస్య సుమారు 40 శాతం చిన్నారుల్లో ఉంది. ప‌రాగ్వే, ఉగాండా దేశాల్లో మాత్రం ఈ సమస్య చాలా తక్కువగా, కేవలం 1 శాతం మాత్రమే ఉందని గుర్తించారు. బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య 15 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మయోపియా సమస్యలు 1990 నుంచి 2023 వరకు మూడు రెట్లు పెరిగినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

వివరాలు 

2050 నాటికి ప్రపంచంలోని టీనేజర్లలో సగం మంది మయోపియా బాధితులు

36 శాతం పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, కరోనా మహమ్మారి తర్వాత ఈ గణాంకం మరింత పెరిగిందని అంచనా వేశారు. ప్రైమరీ స్కూల్ దశలోనే మయోపియా సమస్యలు మొదలవుతాయని, ఈ సమస్య 20 ఏళ్ల వయస్సు వరకు కొనసాగుతుందని తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలోని టీనేజర్లలో సగం మంది మయోపియా బాధితులు అవుతారని రిపోర్టులో పేర్కొన్నారు. మయోపియా సమస్య నుంచి బయట పడేందుకు, ప్రతి రోజు పిల్లలు కనీసం రెండు గంటలపాటు ఆరుబయట గడపడం, ఏడు నుంచి తొమ్మిది ఏళ్ల వయస్సు మధ్య ఉన్న పిల్లలకు ఇది మరింత అవసరమని నిపుణులు సూచించారు.