Page Loader
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్‌ ఆంబ్రోస్‌,గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌  
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్‌ ఆంబ్రోస్‌,గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌

Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్‌ ఆంబ్రోస్‌,గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2024
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి (The Nobel Prize 2024) వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు ఈ పురస్కారం వారికి వరించింది. ఈ పురస్కారాలను స్వీడన్‌లోని స్టాక్‌హోం లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్‌ బృందం ప్రకటించింది. గతేడాది కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు హంగేరి-అమెరికన్‌ కాటలిన్‌ కరికో (Katalin Kariko) అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్‌ (Drew Weissman)లకు వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది. ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 114 సార్లు నోబెల్‌ బహుమతులు ప్రకటించబడ్డాయి, ఇందులో 227 మంది గ్రహీతలు ఉన్నారు, అందులో కేవలం 13 మంది మహిళలే.

వివరాలు 

అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లు 

వైద్య విభాగంలో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం అక్టోబర్‌ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు. శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024) అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త,ఇంజినీర్‌,వ్యాపారవేత్తగా ప్రసిద్ధి చెందిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించిన తరువాత, 1901 నుండి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 10 లక్షల డాలర్లు) నగదు అందించబడుతుంది, వీటిని డిసెంబర్‌ 10న గ్రహీతలకు అందజేస్తారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నోబెల్ ప్రైజ్ టీమ్ చేసిన ట్వీట్